మొత్తానికి నన్ను ఒకరు అర్థం చేసుకున్నారు... సమంత పోస్ట్ వైరల్!

సినిమాలకు ఏడాది పాటు విరామం ప్రకటించినటువంటి సమంత( Samantha ) ప్రస్తుతం న్యూయార్క్ నగరంలో చక్కర్లు కొడుతున్నారు.

న్యూయార్క్ పరేడ్ గ్రౌండ్లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి ఈమె అనంతరం న్యూయార్క్ నగరంలో సందడి చేస్తూ అక్కడ దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.అయితే ఈమె గత కొంతకాలంగా లవ్ రిలేషన్షిప్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్లు చేయడంతో సమంత మళ్ళి ప్రేమలో పడిందా అన్న సందేహాలు అందరికీ కలుగుతున్నాయి.

తాజాగా సామ్ బ్లూకలర్ డెనిమ్ జాకెట్ లో మరింత స్టైలీష్ గా కనిపిస్తుంది.ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఈమె మొత్తానికి నన్ను ఒకరు అర్థం చేసుకున్నారు అంటూ ఈ ఫోటోలను పోస్ట్ చేశారు.మరి సమంత ఎవరిని ఉద్దేశించి ఇలాంటి పోస్ట్ చేశారు అనే విషయాన్ని వస్తే.

ఎట్టకేలకు నన్ను ఒకరు అర్థం చేసుకున్నారు అంటూ చేతిలో సమంత జంబో కాఫీ కప్పు పట్టుకొని కెమెరాలకు నవ్వుతూ ఫోజులిచ్చారు.ఈ ఫోటోలను షేర్ చేసిన ఈమె చివరిగా నన్ను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి #jumbosizedcoffee అంటూ రాసుకొచ్చింది.

Advertisement

ప్రస్తుతం సమంత చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నటువంటి నేపథ్యంలోనే ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటూ తన ఆరోగ్యం పై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.ఇక ఈమె చివరిగా తెలుగులో ఖుషి( Khushi ) సినిమాలో నటించి సినిమాలకు విరామం ప్రకటించారు.ఇక ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమాలో సమంత విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) జంటగా నటించారు.ప్రస్తుతం విజయ్ దేవరకొండ పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీ అయ్యారు.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు