క్షేత్ర స్థాయి టీఆర్ఎస్ క్యాడరే బీజేపీ టార్గెట్టా?

తెలంగాణ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరదీసిన విషయం మనం చూస్తూనే ఉన్నాం.

తెలంగాణలో క్రమక్రమంగా బలపడుతున్న బీజేపీ 2013 లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

ఇందులో భాగంగానే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏకధాటిగా విమర్శిస్తూ, ఇటు టీఆర్ఎస్ పార్టీని బలహీన పరచడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది.ముఖ్యంగా బీజేపీ టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న క్షేత్ర స్థాయి క్యాడర్, సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు గల వారిని బీజేపీలోకి ఆహ్వానిస్తూ క్షేత్ర స్థాయిలో ఉన్న బలమైన నాయకత్వాన్ని దెబ్బతీసి టీఆర్ఎస్ పార్టీని అస్థిరపరచాలన్నది బీజేపీ బలమైన వ్యూహం.

కాని ఇంత జరుగుతున్నా కేసీఆర్ బీజేపీ చేస్తున్న రాజకీయంపై అసలు స్పందించిన పరిస్థితి లేదు.కేసీఆర్ మౌనం వెనుక అంతరార్ధమేమన్నది కేసీఆర్ వేయబోయే తరువాత స్టెప్ ను బట్టి మనకు తెలిసే అవకాశం ఉంది.అసంతృప్తులను ఒక్కటి చేస్తున్న బీజేపీ తరువాత కేసీఆర్ మైండ్ గేమ్ తో అసంతృప్తులు తిరిగి టీఆర్ఎస్ లోకి వెళ్తే బీజేపీ ఏమని చెప్పి బీజేపీలోకి ఆహ్వానించింది అన్నది వీరి రూపంలో ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంది.

మరల బీజేపీలోని చేరికలను ఇక ప్రజలు అంత సీరియస్ గా తీసుకునే అవకాశం లేదు.

Advertisement
ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 

తాజా వార్తలు