చెరువు మత్తడికి మరమ్మత్తులు చేపట్టాలి : డి ఈ కి వినతి పత్రం అందజేసిన రైతులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని వీరసముద్రం చెరువు మత్తడికి బుంగలు పడి నీరు వృధాగా పోవడంతో మరమ్మత్తులు( Pond Dam Repairs ) చేపట్టాలని రైతులు డీఈకి వినతి పత్రం అందజేశారు.

చెరువు ఆయకట్టు రైతులు మాట్లాడుతూ ఇటీవల అధిక వర్షాలు కురవడంతో చెరువు పూర్తిగా నిండి ఉంది.

అయితే చెరువు మత్తడి కింద దాదాపు ఆరు నుండి పది వరకు బుంగలు ఉండటం వలన దాదాపు రెండు మూడు ఇంచుల నీరు వృధాగా పోవుచున్నదని పేర్కొన్నారు.ఈ కారణంగా  యాసంగి పంటకు వ్యవసాయ బావులలో నీటి ఎద్దడి ఏర్పడుతుందని తెలిపారు.

కావున ఈ నీటి ఎద్దడిని తప్పించే విధంగా చెరువు మొత్తానికి తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టి రానున్న వేసవికాలంలో శాశ్వత పరిష్కారం చేయవలసిందిగా డిఈ9 DE )ని కోరినట్లు వెల్లడించారు.ఫిబ్రవరి నెలలో ముస్తాబాద్( Mustabad 0 పెద్ద చెరువు నీళ్లను పిల్ల కాలువ ద్వారా వీర సముద్రం చెరువుకు నీటిని విడుదల చేసి చెరువు కింద చెరువు నింపవలసిందిగా  నీటి పారుదల డిఈకి వినతిపత్రం అందజేశామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో రాములు,నగేష్ మల్లయ్య, నాంపల్లి, తుక్కయ్య దేవయ్య,చంద్రయ్య,భూదయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ

Latest Rajanna Sircilla News