లాలా భీమ్లాకు ఫరియా అబ్దుల్లా డ్యాన్స్.. సోషల్ మీడియాలో వైరల్!

న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం జాతి ర‌త్నాలు.ఈ మూవీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఫరియా అబ్దుల్లా.

యూట్యూబర్‌గా ఫ‌రియాకు మంచి గుర్తింపు ఉంది.ఇక జాతి ర‌త్నాలు మూవీలోని చిట్టీ పాట ద్వారా ఫరియా మరింత ఫేమ్‌ని సంపాదించుకుంది.

అందులో క్యూట్ లుక్ తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది.మొదటి సినిమాతోనే భారీ హిట్‌ను ఖాతాలో వేసుకుంది.

అయితే సినిమాల్లో నటించకపోయినా అప్పటికీ ఈమె సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈమె ఒక పాటకు స్టెప్పులు ఒక రేంజ్ లో ఇరగదీసింది.

Advertisement

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.ఈమె తన అందం డాన్స్,ఎక్స్ ప్రెషన్స్ తో దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించి జాతి రత్నాలు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

ఇటీవలే అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా నటించింది.ఇదిలా ఉంటే తాజాగా ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో లాలా బీమ్లా నాయక్ పాటకు ఒక రేంజ్ లో దుమ్ము దులిపింది.ఈ పాటకు డాన్స్ అదరగొడుతూ స్టెప్పులు ఇరగదీసింది.

ఈ వీడియోలో ఫరియా బ్లాక్ వేర్ లో తన డ్యాన్స్ పాట్నర్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులేసింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు