బ్రో సినిమాకి వర్షం అడ్డంకి కాదు అంటున్న ఫ్యాన్స్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా వచ్చిన చాలా చనిమలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి అలాగే ఆయన సినిమాలకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ఏజ్ గ్రూప్ తో సంబందం లేకుండా నదరు థియేటర్ కి వచ్చి సినిమా చూస్తుంటారు.

అయితే ఇప్పుడు ఆయన బ్రో అనే సినిమా చేసిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు మెగా మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కూడా హీరో గా నటించాడు.ఈ మెగా మ‌ల్టీస్టార‌ర్ ను జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మించారు.ఇక ఈ సినిమా కి తమిళ దర్శకుడు నటుడు అయిన స‌ముద్ర‌ఖ‌ని( Samuthirakani ) దర్శకత్వము వహించారు.

అలాగే ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ డైలాగ్స్‌, స్క్రీన్ ప్లే అందించారు.పేరుకు త‌మిళ సూప‌ర్ హిట్ `వినోద‌య సిత్తం`కు రీమేక్ అయినా.స్క్రిప్ట్ మొత్తానికి ఆల్మోస్ట్ మార్చేశారు.

మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు గా మార్చారు.అలాగే పవన్ కళ్యాణ్ కి తగ్గట్టు గా చాలా అనగా చేశారు అంటూ కామెంట్లు కూడా వస్తున్నాయి.

Advertisement

ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్లు ఈ విష‌యాన్ని క‌న్ఫార్మ్ చేశాయి.ఇందులో కేతిక శ‌ర్మ( Ketika Sharma ) హీరోయిన్ గా న‌టిస్తుంటే.ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌, రోహిణి, తనికెళ్ళ భరణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శి రౌతేలా స్పెష‌ల్ సాంగ్ లో మెరిసింది.జూలై 28న బ్రో సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

ఇందులో మెయిన్ హీరో ప‌వ‌న్ కళ్యాణ్ కాక‌పోయినా.ఆయ‌న క్రేజ్ దృష్ట్యా బ్రో సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జ‌రిగింది.ఒక్క నైజాం ఏరియాలోనే ఏకంగా రూ.30 కోట్ల రేంజ్ లో బిజినెస్ జ‌రిగింది.అలాగే సీడెడ్ లో రూ.13.20 కోట్లు, ఉత్త‌రాంద్ర‌లో రూ.9.50 కోట్లు, తూర్పు గోదావ‌రిలో రూ.6.40 కోట్లు, పశ్చిమ గోదావ‌రిలో రూ.5.40 కోట్లు, గుంటూరులో రూ.7.40 కోట్లు, కృష్ణలో రూ.5.20 కోట్లు మ‌రియు నెల్లూరులో రూ.3.40 కోట్లకు బ్రో థ్రియేట్రిక‌ల్ హ‌క్కులు అమ్ముడుపోయాయి.అంటే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా బ్రో బిజినెస్ రూ.80.50 కోట్లు అన్న‌మాట‌.

ఇక క‌ర్ణాట‌క, రెస్టాఫ్ ఇండియాలో రూ.5 కోట్లు, ఓవ‌ర్సీస్ లో రూ.12 కోట్లు బిజినెస్ జ‌రిగింది.వ‌ర‌ల్డ్ వైడ్ గా బ్రో టోట‌ల్ బిజినెస్ వ్యాల్యూ రూ.97.50 కోట్లు.ఈ లెక్క‌ల బ్రోతో మెగా హీరోలుగా హిట్ కొట్టాలంటే రూ.98.50 రేంజ్ లో షేర్ వ‌సూళ్ల‌ను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.పాజిటివ్ టాక్ వ‌చ్చినా కూడా ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఈ రేంజ్ క‌లెక్ష‌న్స్ ను రాబ‌ట్ట‌డం అంటే మామూలు విష‌యం కాలు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

అస‌లే గ‌త ప‌ది రోజుల నుంచి తెలుగురాష్ట్రాల్లో వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి.తెలంగాణాలో మరో మూడు రోజులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.అలాగే ఏపీలో కూడా వారం రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Advertisement

అయితే ఇలాంటి నేపథ్యం లో సినిమా కి వర్షం కారణం గా దెబ్బ పడే అవకాశం ఉంది అని ట్రేడ్ పండితులు అంటున్నారు అయితే దీనికి పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం వర్షం కాదు వరద వచ్చిన మేము థియేటర్ కి వస్తాం సినిమా చూస్తాం అని అంటున్నారు.అయితే అప్పట్లో చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ( Jagadeka Veerudu Atiloka Sundari )రిలీజ్ టైం లో కూడా ఫుల్ గా వర్షం పడింది కానీ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.

ఇక ఈ సినిమా విషయం లో కూడా అదే రిపీట్ అవుతుంది అని అంటున్నారు వర్షం మా మెగా హీరోలకి చాలా వరకు కలిసి వస్తుంది అని అంటున్నారు.

తాజా వార్తలు