తెలుగులో ఒకప్పుడు క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ దుమారం రేపిన టాలీవుడ్ లో ప్రముఖ నటి “శ్రీ రెడ్డి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు అనుకోకుండా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో కొంతకాలం పాటు సినిమా పరిశ్రమ బహిష్కరణకు గురైంది.
దీంతో సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించుకుంటూ తరచూ ఏదో ఒక విషయంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.
అయితే తాజాగా శ్రీ రెడ్డి తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా చేసినటువంటి ఓ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
ఇందులో భాగంగా సాంప్రదాయ దుస్తులను ధరించి చీరలో కనిపిస్తున్న ఫోటోని షేర్ చేసింది.అంతేకాకుండా తమ శత్రువులతో మాత్రమే కఠినంగా ప్రవర్తిస్తారని నిజాయితీ గల స్నేహితులతో తానెప్పుడూ చాలా లాయల్ గా ఉంటానని క్యాప్షన్ కూడా పెట్టింది.
దీంతో ఓ నెటిజన్ తాను మీకు పెద్ద అభిమానిని అని అలాగే మీరు ఈ మధ్యకాలంలో ఏదైనా ఒక విషయం గురించి ప్రశ్నించే సమయంలో ఎక్కువగా బూతులు మాట్లాడుతున్నారని దాంతో మీరు చేసిన పని మంచిదే అయినప్పటికీ కొందరు విమర్శిస్తున్నారని కాబట్టి బూతులు మాట్లాడటం మానేయాలని రిక్వెస్ట్ చేశాడు.దీంతో శ్రీ రెడ్డి ఈ కామెంట్ పై స్పందిస్తూ సరేనని అలాగే కొన్ని సందర్భాలలో తప్పదని చాలా వరకు బూతులు మాట్లాడటం మానేస్తానని రిప్లై ఇచ్చింది.