మహిళా సర్పంచ్ ప్రాణం తీసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్.. !

తలరాత బలహీనంగా ఉంటే తాడు కూడా పాములా మారి కాటేస్తుంది అని అంటారు.కొన్ని కొన్ని ఘటనలను చూస్తే ఈ మాటలు నిజమే కావచ్చూ అనిపిస్తుంది.

ఎందుకంటే బ్రతకాలని రాసి ఉంటే ప్రమాద తీవ్రత ఎంత బలంగా ఉన్నా బ్రతికిన వారు ఉన్నారు.అదే చిన్న చిన్న అనారోగ్యాలకే ప్రాణాలు విడిచిన వారు ఉన్నారు.

ఇకపోతే ఇలాగే నారాయణపేట జిల్లాలోని దామరగిద్దలో మహిళా సర్పంచ్ మరణించిన ఘటన చోటు చేసుకుంది.ఆ వివరాలు తెలుసుకుంటే.

దామరగిద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహిళా సర్పంచ్ లక్ష్మి, ఈ ఆపరేషన్ చేసిన కొద్దిసేపటికే వైద్యం వికటించి ఆరోగ్యం సహకరించక పోవడంతో జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందిందట.కాగా తన భార్య లక్ష్మి డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని సర్పంచ్ భర్త ఆరోపిస్తున్నారు.

Advertisement

కానీ ఇక్కడి వైద్యులు మాత్రం ఆపరేషన్‌కు ముందు జరిగే ఇన్ సీజర్ ప్రక్రియ తర్వాత ఫిట్స్ రావడంతో మృతి చెందినట్టు తెలుపుతున్నారు.

వైట్ హౌస్ గేట్‌ను ఢీకొట్టిన వ్యక్తి.. కట్ చేస్తే మృతి..?
Advertisement

తాజా వార్తలు