అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు

యాదాద్రి భువనగిరి జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాల నాయకులు అసత్య ఆరోపణలు చేసి,రాజకీయ పబ్బం గడుపుకోవాలను చూస్తున్నారని యాదగిరి గుట్ట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బందారపు భిక్షపతి గౌడ్ అన్నారు.

శుక్రవారం యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వద్దకు పట్టణ కాంగ్రెస్ నాయకులతో కలిసి వచ్చిన ఆయన మాట్లాడుతూ యాదాద్రి ఆలయ ఉద్యోగుల బదిలీల విషయంలో ఎమ్మేల్యే బీర్ల ఐలయ్య అవినీతికి పాల్పడినట్టు చేసిన ఆరోపణలను నిరూపించడానికి వైకుంఠ ద్వారం వద్దకు రావాలని సవాల్ చేస్తే ప్రతిపక్ష నాయకులు రాకపోవడం చూస్తేనే వాళ్ళు చేసే ఆరోపణలు అబద్ధమని తెలుస్తుందన్నారు.

ఎమ్మెల్యే ఐలయ్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తాము వైకుంఠ ద్వారం వద్ద ప్రమాణం చేస్తున్నామని,ప్రతిపక్ష నేతలు కూడా ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ఈకార్యక్రమంలో యాదగిరిగుట్ట కాంగ్రెస్ పట్టణ నాయకులు గుండ్లపల్లి వాణి,భరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Video Uploads News