Divya Bharti: దివ్యభారతి కోసమే సినిమా తీసి నిర్మాతను రోడ్డు పాలు చేసిన హీరో ఎవరు ?

మోహన్ బాబు దివ్యభారతి కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి.మొదటిది అసెంబ్లీ రౌడీ.

( Assembly Rowdy Movie ) ఈ సినిమా కథ మాతృక చంద్రముఖి సినిమాల దర్శకుడు అయిన పి వాసు అందించారు.ఆ సినిమాను తెలుగులో అసెంబ్లీ రౌడీ పేరు తో తెరకెక్కించగా మాస్ చిత్రాల దర్శకుడు బి.

గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఇందులోని పాటలు అద్భుతమైన ప్రేక్షకధారణ పొందాయి.

దివ్య భారతి( Divya Bharti ) ఈ సినిమాకి దివ్యభారతి ఎంతగా ప్లస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమాతోనే మోహన్ బాబు కూడా కలెక్షన్ కింగ్ గా కూడా మారాడు.

Advertisement

ఈ సినిమాను తన సొంత బ్యానర్ అయిన శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ లోనే మోహన్ బాబు( Mohan Babu ) ప్రొడ్యూసర్ గా మారి తెరకెక్కించాడు.అయితే ఈ సినిమాలో దివ్యభారతీ, మోహన్ బాబుల కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయ్యింది అనే టాక్ వచ్చింది.పైగా అసెంబ్లీ రౌడీ సినిమా కోసం మోహన్ బాబు భారీగా డబ్బు కూడా ఖర్చు పెట్టాడు.

ఈ చిత్రంలోని అందమైన వెన్నెలలోన అనే పాట కోసం కూడా ఎంతో ఖర్చు పెట్టించగా ఇప్పటికీ అప్పటికి ఒక ఎవర్గ్రీన్ సాంగ్ గా మిగిలిపోయింది.

దివ్యభారతి కోసం ఈ సినిమాను మళ్ళీ మళ్ళీ చూసిన ప్రేక్షకులు కూడా ఉన్నారు.అసెంబ్లీ రౌడీ విజయం సాధించగానే దివ్యభారతి కోసం టాలీవుడ్ లోని దర్శకులు, నిర్మాతలు క్యూ కట్టారు.అయితే ఆమె అప్పటికే బాలీవుడ్ తో పాటు అనేక భాషల్లో బిజీగా ఉన్న ఆర్టిస్ట్ కాబట్టి చాలా తక్కువ సినిమాల్లోనే తెలుగు చిత్ర పరిశ్రమకు పరిమితం అయింది.

ఇక వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలతో నటించిన దివ్యభారతి అందరితో ఒక్కో చిత్రం లోనే నటించినప్పటికీ కేవలం మోహన్ బాబుతోనే మరొక సినిమా కూడా చేసింది.అదే చిట్టమ్మ మొగుడు.( Chittemma Mogudu Movie ) ఈ కథ మాతృక కూడా తమిళ సినిమానే.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

అయితే కథపై పూర్తి నమ్మకం లేని మోహన్ బాబు వేరే నిర్మాత తో( Producer ) డబ్బులు పెట్టించాడు.దివ్య భారతి హీరోయిన్ అయితేనే సినిమా తీస్తాను అని మోహన్ బాబు చెప్పడంతో కేవలం దివ్యభారతి కోసమే ఈ సినిమా తీసినట్టుగా అయిపోయింది.

Advertisement

కానీ సినిమా విడుదలై దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుని నిర్మాతను రోడ్డు పాలు చేసింది.దాంతో దివ్యభారతి కోసం నిర్మాతను నిండా ముంచేశాడు మోహన్ బాబు అనే టాక్ అప్పట్లో బాగా వచ్చింది.

తాజా వార్తలు