Experimental movies: రానా ఆరు.. మహేష్ బాబు 4.. అంత కష్టపడి సినిమాలు తీసిన.. ఫలితం మాత్రం?

Experimental movies: సినిమా అంటే చాలా వరకు కమర్షియల్ కథలే కనిపిస్తాయి.ఎక్కువగా లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామా కాన్సెప్టులలో సినిమాలు ఎక్కువగా వస్తాయి.

ప్రేక్షకులు కూడా ఇటువంటి వాటినే ఇష్టపడుతుంటారు.ఇక కమర్షియలే కాకుండా ప్రయోగత్మక సినిమాలను కూడా ఇష్టపడుతుంటారు.

కానీ ఆ ప్రయోగత్మక సినిమాలను తీయడంలో కొందరు డైరెక్టర్లు ఫెయిల్ అవుతున్నారు.పైగా హీరోలను ప్రయోగాత్మక పాత్రలలో చూపించడంలో కూడా విఫలం అవుతున్నారు.

దీంతో అలా ప్రయోగాత్మక సినిమాలలో నటించిన హీరోలు అంత కష్టపడి సినిమాలు చేసినా కూడా ఫలితం అందుకోలేకపోతున్నారు.నిజానికి ప్రయోగత్మక సినిమాలు అంటే అంత సులువు కాదని చెప్పాలి.

Advertisement

ఎందుకంటే ఎక్స్పరిమెంట్ అంటే నటుడు ఆ పాత్రను ఎక్స్పరిమెంట్ గా చేయాలి.అంటే ఒక ఎక్స్పరిమెంట్ సినిమాలో తన పాత్రను పూర్తిగా మాట తీరు నుండి బాడీ లాంగ్వేజ్ వరకు కూడా ఎక్స్పరిమెంట్ చేయాల్సి ఉంటుంది.

ఇక టాలీవుడ్ లో మహేష్ బాబు, రానా ఎక్స్పరిమెంట్ సినిమాలు చేయటానికి చాలా వరకు ముందుకు వచ్చారు.కానీ ఏం లాభం.

ఆ సినిమాలు మాత్రం వారికి మంచి సక్సెస్ ఇవ్వలేకపోయాయి.ఇక మహేష్ బాబు 4 ఎక్స్పరిమెంట్ సినిమాలు చేయగా.

రానా ఏకంగా ఆరు సినిమాలు చేశాడు.ఇక మహేష్ బాబు చేసిన సినిమాల విషయానికి వస్తే.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఖలేజా:

2010లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విచిత్రమైన యాక్షన్ కామెడీ నేపథ్యంలో రూపొందింది.కానీ ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది.

వన్ నేనొక్కడినే:

సుకుమార్ దర్శకత్వంలో 2014లో విడుదలైన ఈ సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా కూడా ప్లాఫ్ అయింది.

Advertisement

నిజం:

తేజ దర్శకత్వంలో విడుదలైన సినిమా నిజం.ఇక ఇందులో మహేష్ బాబు పాత్ర చాలా డీసెంట్ గా కనిపిస్తుంది.

కానీ ఎందుకో మహేష్ బాబు ఈ పాత్రను సరిగ్గా చూపించలేకపోయాడు.దీంతో ఈ సినిమా కూడా ప్లాఫ్ అయింది.

నాని:

ఎస్ జె సూర్య దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందింది.ఇక ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర గురించి అందరికీ తెలిసిందే.

కానీ ఈ సినిమా కూడా సక్సెస్ కాలేకపోయింది.

ఇక రానా చేసిన సినిమాల విషయానికి వస్తే.

అరణ్య:

గత ఏడాది ప్రభు సాల్మన్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా విడుదల కాగా ఇందులో రానా డిఫరెంట్ పాత్రతో రాగా సినిమా హిట్ కాలేకపోయింది.

ఘాజి:

2017 లో విడుదలైన ఈ సినిమా.జలాంతర్గామి నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.

కానీ ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు.

నేనే రాజు నేనే మంత్రి:

2017లో తేజ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమాలో రానా అద్భుతంగా నటించిన కూడా ఎక్కడో ఏదో తక్కువైనట్లు అనిపించింది.

లీడర్:

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ సినిమా విడుదల కాగా రాజకీయ నేపథ్యంతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా కూడా అంతగా పేరు తెచ్చుకోలేకపోయింది.

విరాటపర్వం:

వేణు ఊడుగుల దర్శకత్వంలో ఈ ఏడాది విడుదలైన ఈ సినిమా నక్సలిజం నేపథ్యంలో వచ్చింది.ఇక ఈ సినిమా కూడా ప్రయోగాత్మకంగా రాగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది.

కృష్ణం వందే జగద్గురుం:

జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వంలో 2012లో విడుదలైన ఈ సినిమా మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

తాజా వార్తలు