రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిపై ఉత్కంఠ..!

రాజమండ్రి వైసీపీ ఎంపీ( Rajahmundry YCP MP ) అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది.

రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా నిలవాలనే ఉద్దేశంతో పార్టీ నేతలు క్యూ కడుతున్నారు.

రాజమండ్రి ఎంపీ రేసులో మహిళ సహా ముగ్గురు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉన్నారని తెలుస్తోంది.గుబ్బల తులసీకుమార్, డాక్టర్ అనసూరి పద్మలత, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ బరిలో నిలిచారు.

ఇప్పటికే పలుమార్లు వైసీపీ పెద్దలను గుబ్బల తులసీకుమార్ కలిసిన సంగతి తెలిసిందే.మరోవైపు ఎంపీ సీటు దక్కించుకునేందుకు పద్మలత( Anasuri Padmalatha ) సైతం తీవ్ర కసరత్తు చేస్తుంది.

పద్మలతకే రాజమండ్రి ఎంపీ సీటు వస్తుందని ఆమె అనుచరులు చెబుతున్నారు.అయితే రాజమండ్రి ఎంపీ సీటును బీసీ సామాజిక వర్గం నేతలకే ఇస్తామని మిథున్ రెడ్డి( Mithun Reddy ) ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement
ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!

తాజా వార్తలు