I’M BACK : రెండేళ్ల తర్వాత ఫేస్‌బుక్‌లో ట్రంప్ పోస్ట్ .. ఇక సౌండ్ మామూలుగా వుండదు..!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) దాదాపు రెండేళ్ల తర్వాత ఫేస్‌బుక్‌లో ( Facebook ) పోస్ట్ చేశారు.

ఈ రోజు ఉదయం ‘‘Im Back" అంటూ ఆయన పోస్ట్ పెట్టారు.

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం 2020 జనవరి 6న యూఎస్ కాంగ్రెస్.క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.

ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.

బారికేడ్లను దాటుకుని మరి వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు.వారిని శాంతింపజేసేందుకు తొలుత టియర్ గ్యాస్ ప్రయోగించినప్పటికీ లాభం లేకపోయింది.

Advertisement

దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు తూటాలకు పనిచెప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటనకు సంబంధించి యూఎస్ కాంగ్రెస్‌( US Congress ) సభ్యులతో కూడిన స్వతంత్ర కమిటీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ వంటి సోషల్ మీడియా దిగ్గజాలు ఆయనపై నిషేధం విధించాయి.అయితే ఇటీవలే ఆయనపై ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు నిషేధం ఎత్తివేశాయి.2024 అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం ట్రంప్‌కు ఊరట కలిగించేదే.

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు ఓటర్లను చేరుకోవడానికి, నిధుల సేకరణకు సాధనాలుగా ఉపయోగపడతాయి.ఫిబ్రవరి 9 నాటికి ట్రంప్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 23 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 34 మిలియన్ల మంది ఫాలోవర్లు వున్నారు.ఈ సందర్భంగా ట్రంప్ ప్రచార ప్రతినిధి ఫాక్స్ న్యూస్‌ డిజిటల్‌తో మాట్లాడుతూ.

మాజీ అధ్యక్షుడు ఫేస్‌బుక్‌లోకి తిరిగి రావడం 2024లో ఓటర్లను చేరుకోవడానికి ఒక ముఖ్యమైన సాధనమన్నారు.అయితే సోషల్ మీడియా దిగ్గజాల నిషేధం నేపథ్యంలో ట్రంప్ 2021 చివరిలో ‘‘ట్రూత్ సోషల్ ’’ అనే పేరిట సొంత సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంను స్థాపించిన సంగతి తెలిసిందే.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

కాగా.ఈ ఏడాది జనవరిలో ట్రంప్‌పై వున్న నిషేధాన్ని సోషల్ మీడియా సంస్థలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు ఎత్తివేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు మెటా సంస్థ ప్రకటించింది.

Advertisement

మంచైనా, చెడైనా ప్రజలు ఇకపై తమ రాజకీయ నాయకులు ఏం చెబుతున్నారో వినవచ్చని మెటా పేర్కొంది.బ్యాలెట్ బాక్స్ ద్వారా అంతిమంగా తమ నిర్ణయాన్ని తెలపొచ్చని చెప్పింది.

ఇక ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ చేజిక్కించుకున్న వెంటనే ట్రంప్‌పై నిషేధాన్ని ఎత్తివేసిన సంగతి తెలిసిందే.ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌ మరింత రెచ్చిపోతారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు