నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం వెంటనే ఇవ్వాలి - వైఎస్ షర్మిల

వైరా నియోజక వర్గం: కొణిజర్ల మండలం తనికెళ్లలో అకాల వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని పరిశీలించిన వైఎస్ షర్మిల.

సర్వం కోల్పోయామని షర్మిలకు వివరించిన రైతులు.

మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అస్వస్థతకు గురైన షర్మిల.పొలంలోనే కింద పడిపోయిన షర్మిల.

వైఎస్ షర్మిల YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.ఇటీవల కురిసిన వర్షానికి ఖమ్మం రైతులు దారుణంగా నష్టపోయారు.

అకాల వర్షాలకు చేతికొచ్చిన మొక్క జొన్న పంట నేల పాలయ్యింది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.

Advertisement

గత నెల ఇదే ఖమ్మం జిల్లాకి కేసీఅర్ వచ్చాడు.మొక్క జొన్న పంటను పరిశీలించి 10 వేలు ఇస్తా అని ప్రకటన చేశాడు.

గాలి మోటార్లో వచ్చి గాలి మాటలు చెప్పాడు.ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు.

పెద్ద పెద్ద భవంతులు కట్టేందుకు డబ్బులు ఉంటాయి.పంట నష్టపోయిన రైతులకు ఇవ్వడానికి రూపాయి కూడా ఉండదు.2.50 లక్షల ఎకరాలు అని చెప్పి ఇప్పుడు లక్షా 50 వేల ఎకరాలు అన్నారు.అది కూడా లేదు.బొడి 5 వేలు రైతు బందు ఎవడు అడిగాడు.30 నుంచి 50 వేలు పెట్టుబడి పడితే నష్టపోయారు.5 వేలు ఏ మూలకు సరిపోతాయి.ఇదేనా కేసీఅర్ పాలన.రాష్ట్రంలో ఇప్పటి వరకు 9.50 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది.కనీసం ఒక్క ఎకరాకు పరిహారం ఇవ్వలేదు.

నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం వెంటనే ఇవ్వాలి.

వీడియో: కోర్టులో డివోర్స్ కేసు నడుస్తుండగా భార్యను ఎత్తుకెళ్లిన భర్త.. చివరికి..
Advertisement

తాజా వార్తలు