' ఈటెల ' కు అన్నీ ఇబ్బందులే ? అంత ఆందోళన ఎందుకో ? 

హుజురాబాద్ బిజెపి అభ్యర్థి గా ప్రచారం అవుతున్న ఈటెల రాజేందర్ కు ఈ నియోజకవర్గంలో గట్టి పట్టే ఉంది.

గతంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి గెలవడంతో నియోజకవర్గంలోనూ పరిచయాలు ఎక్కువగానే ఉన్నాయి.

దీంతో తమకు ఎటువంటి డోకా లేదు అని రాజేందర్ భావిస్తూ వచ్చారు.అయితే ఈ ఆరు సార్లు టిఆర్ఎస్ తరుపున పోటీ చేసి గెలవడంతో, కారు గుర్తు జనాల్లోకి బాగా వెళ్లిందని,  ఇప్పుడు బిజెపి తరఫున పోటీ చేస్తుండటంతో ఆ పరిస్థితి ఉండదు ఏమో అనే భయం రాజేందర్ లో కనిపిస్తోంది.

దీనికి తోడు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న నిత్యావసర ధరలు,  పెట్రోల్ , డీజిల్ ధరలు ఇవన్నీ తప్పనిసరిగా తన ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయి అనే టెన్షన్ ఉంది.అది కాకుండా ఈ నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా పట్టు లేకపోవడం, పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలు, అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఇవన్నీ తనకు ఇబ్బందులు తీసుకు వస్తాయి అనే టెన్షన్ లో రాజేందర్ ఉన్నారు.

తాను బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి  కాబట్టి ఆ సామాజికవర్గం అండదండలు పూర్తిగా తనకు ఉంటాయని రాజేంద్ర నమ్ముతున్నారు.అయితే ఆరుసార్లు ఎక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో సహజంగానే కొన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి బాగా ఉంది.

Advertisement

పెద్దగా ఈ నియోజక వర్గాన్ని పట్టించుకోకపోవడం, పూర్తిగా రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టడం ఇలా అనేక అంశాలు రాజేందర్ ఇబ్బందులు తెచ్చిపెట్టినట్టు కనిపిస్తున్నాయి. 

 ప్రస్తుతం ఈ ఎన్నికలు తనకి టిఆర్ఎస్ కు మధ్య పోటీ అన్నట్లుగా ప్రచారం జరుగుతుండడం కూడా ఆయనకుు ముప్పు  తెచ్చేలా కనిపిస్తోంది.పార్టీ గుర్తు పెద్దగా వెళ్ళకపోతే రాజేందర్ కు ఇబ్బందులు తప్పవు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఎందుకంటే తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యవహారాల గురించి రాజేందర్ కు బాగా తెలుసు.

ఇక్కడ గెలిచేందుకు ఆయన ఏం చేసేందుకైనా వెనకాడరు అని, చాపకింద నీరులా అన్ని వ్యవహారాలు చక్కబెడతారు అనే భయం రాజేందర్ లో ఉన్నట్లు  గా కనిపిస్తోంది.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు