అమెరికాలోని భూమి జప్తు

అమెరికాలోని భూమి జప్తు (అటాచ్‌మెంట్) అయితే మనకేమిటి సంబంధం? దాన్ని గురించి ఎందుకు చెప్పుకోవాలి? అనే ప్రశ్నలు రావడం సహజం.

అయితే ఆ భూమిని జప్తు చేసింది అమెరికా ప్రభుత్వం కాదు.

మన ఎన్ఫోర్స్మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ).అదీ ఇక్కడ విశేషం.

విదేశాల్లోని భూమిని అటాచ్‌ చేయడం అసాధారణ చర్య.ఇలా చేయడం ఇదే మొదటిసారి.

కాలిఫోర్నియాలోని ఈ భూమి విలువ వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఉంది.మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈ చర్య తీసుకున్నారు.

Advertisement

జూమ్‌ డెవలపర్స్ ప్రయివేటెడ్‌ లిమిటెడ్‌ అనే సంస్థ, విజయ్‌చౌధురి అనే వ్యాపారి బ్యాంకును మోసం చేసిన కేసులో ఈడీ ఈ అసాధారణ చర్య తీసుకుంది.రుణాలు తీసుకొని బ్యాంకును మోసం చేసిన కేసుల్లో దేశంలో ఇది అతి పెద్దదని ఈడీ అధికారులు చెప్పారు.

అమెరికాలోని భూమిని కూడా అటాచ్‌ చేసిన మన ఈడీ అధికారుల సామర్థ్యాన్ని మెచ్చుకొని తీరాల్సిందే.దేశంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన కోటీశ్వరులు, బడా పెట్టుబడిదారులు అనేకమంది ఉన్నారు.

ప్రభుత్వం నల్లధనాన్ని ఎలా రప్పించలేకపోతున్నదో బ్యాంకులను మోసం చేసిన బడాబాబులను కూడా ఏం చేయలేకపోతున్నది.ఆర్థిక నేరాల్లో శిక్షలు పడి జైలుకెళుతున్నవారు చాలా తక్కువ.

గిరిజనులతో సరదాగా డ్యాన్స్ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు

Advertisement

తాజా వార్తలు