వైరల్: రూల్స్ పాటించనివారికి పడే శిక్ష ఇదే... ట్విటర్‌లో DCP వీడియో!

మనదేశంలో వివిధ రంగాలలో ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పటికీ వాటి వెనుక ఎన్నో తప్పులు జరిగిపోతూ ఉంటాయి.

అయితే వాటి పర్యవసానం సదరు అధికారులు కాకుండా సామాన్య జనాలు అనుభవిస్తూ వుంటారు.

అయితే ఒకే ఒక రంగంలో మాత్రం ఎవరు చేసిన తప్పులకు వారికే శిక్షలు పడతాయి.అవును, అదే ట్రాఫిక్.

ఇక్కడ రూల్స్ పాటించకుంటే పోలీసులు జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా విధిస్తారు.అదే విధంగా కొన్ని సార్లు మనం రాంగ్ డైరెక్షన్లో పయనించినపుడు అనుకోని ప్రమాదాలు జరిగి ప్రాణాలు సైతం పోయే పరిస్థితులు దారి తీస్తాయి.

అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఏనుగు ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తడం మనం చూడవచ్చు.రోడ్డుపై వెళ్తున్న ఓ ఏనుగు.

Advertisement

రహదారిపై పార్క్ చేసిన బైక్ వద్దకు రాగానే మరి దానికి చిర్రెత్తిందో ఏమిటో? రహదారిపై పార్క్ చేసిన ఆ బైక్ ని తన కాలితో ఓ తన్నుతన్నింది.ఇంకేముంది.

కట్ చేస్తే బైక్ ఫుట్ బాల్ ఎగిరినట్లు ఎగిరి రోడ్డుపక్క ఆమడ దూరంలో పడిపోయింది.ఈ వీడియోను బెంగళూరులోని తూర్పు డివిజన్ ట్రాఫిక్ డీసీపీ కళా కృష్ణస్వామి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.

దానితోపాటు "ప్రధాన రహదారిపై వాహనాలు పార్కింగ్ చేయొద్దు, రూల్స్ పాటించనివారికి పడే శిక్ష ఇదే!" అని రాసుకొచ్చారు.కాగా ఈ వీడియో సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తోంది.కాగా వీడియో షేర్ చేసిన కొద్ది గంటల్లోనే 3.5 లక్షల మంది వీడియోను వీక్షించడం విశేషం.కాగా ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.

ఓ నెటిజన్.ఈ వీడియో మంచి సందేశాన్ని ఇస్తుంది అని అంటే, మరో యూజర్ హాస్యంతో కూడిన వీడియోను పోలీసులు మామ్మూలుగా వాడటం లేదుగా? అని కాస్త ఫన్నీగా కామెంట్ చేసాడు.

ఈ సంగతి తెలిస్తే, మీరు ఇక పానీపూరి బండివంక కన్నెత్తి కూడా చూడరు!
Advertisement

తాజా వార్తలు