స‌మ్మ‌ర్‌లో ఐస్‏క్రీమ్స్‌ను లాగించేస్తున్నారా..? అయితే డేంజ‌ర్‌లో ప‌డ్డ‌ట్టే!

స‌మ్మ‌ర్ సీజ‌న్ స్టార్ట్ అయింది.రోజురోజుకు ఎండ‌లు మండిపోతున్నాయి.

ఈ ఎండ‌ల దెబ్బ‌కు ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావాలంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు.

అయితే స‌మ్మ‌ర్‌లో కూల్ కూల్‌గా ఉండ‌టం కోసం పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మంది ఐస్ క్రీమ్స్‌ను లాగించేస్తుంటారు.

ఇవి తినేందుకు రుచిగానే ఉంటాయి.కానీ, రోజూ తింటే మాత్రం మీరు డేంజ‌ర్‌లో ప‌డ‌టం ఖాయం.

ఎందుకంటే, ఐస్ క్రీమ్స్‌లో చక్కెర, కేలరీలు, కొవ్వులు అధికంగా ఉంటాయి.అందువ‌ల్ల, వీటిని ప‌రిమితికి మించి తీసుకుంటే శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.

Advertisement

ఫ‌లితంగా బ‌రువు పెరుగుతారు.ఒక‌వేళ అధిక బ‌రువు ఉన్న వారు, వెయిట్ లాస్ అయ్యేందుకు డైట్‌ను ఫాలో అయ్యేవారైతే ఐస్ క్రీమ్స్ జోలికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిది.

అలాగే రోజూ ఐస్ క్రీమ్స్‌ను తిన‌డం వ‌ల్ల ర‌క్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు క్ర‌మంగా పెరిగిపోతాయి.ఫ‌లితంగా గుండె పోటు మ‌రియు ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ పెరుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు ఐస్ క్రీమ్స్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.పైన చెప్పిన‌ట్లు ఐస్ క్రీమ్స్‌లో చ‌క్కెర శాతం ఎక్కువ‌గా ఉంటుంది.

ఇది మ‌ధుమేహం ఉన్న వారిలో బ్లెడ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తుంది.ఎప్పుడైనా రిఫ్రెష్ అయ్యేందుకు ఒక‌టి తింటే ప‌ర్వాలేదు.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

కానీ, రోజుకు రెండు, మూడు ఐస్ క్రీమ్స్‌ను లాగించేస్తే.జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు సైతం దెబ్బ తింటుంది.

Advertisement

ఫ‌లితంగా గ్యాస్‌, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లను ఫేస్ చేయాల్సి ఉంటుంది.

అంతేకాదు, ఐస్ క్రీమ్స్‌ను అతిగా తీసుకుంటే శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడ‌తాయి.నిద్ర నాణ్యత త‌గ్గిపోతుంది.మ‌రియు పంటి ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది.

కాబ‌ట్టి, ఇక‌పై ఐస్ క్రీమ్స్‌ను వీలైనంత వ‌ర‌కు తిన‌డం త‌గ్గించండి.అదే ఆరోగ్యానికి మంచిది.

తాజా వార్తలు