అండర్ ఆర్మ్స్ నలుపును పోగొట్టాలా? అయితే ఈ ఎఫెక్టివ్ రెమెడీని ట్రై చేయండి!

డార్క్ అండ‌ర్ ఆర్మ్స్.చాలా మందిని క‌ల‌వ‌ర పెట్టే స‌మ‌స్య ఇది.టైట్‌గా ఉండే దుస్తుల‌ను ధ‌రించ‌డం, చెమ‌ట‌, గాలి ఆడ‌క‌పోవ‌డం, డెడ్ స్కిన్ సెల్స్‌, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే షేవింగ్ ఉత్ప‌త్తుల‌ను వాడ‌టం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల అండ‌ర్ ఆర్మ్స్ లో న‌లుపు ఏర్పుడుతుంటుంది.

ఈ న‌లుపు కార‌ణంగా చాలా మంది అమ్మాయిలు స్లీవ్ లెస్ డ్రెస్ లు ధ‌రించ‌డానికి తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు.

ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే అస్స‌లు టెన్ష‌న్ ప‌డ‌క్క‌ర్లేదు.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే ఎఫెక్టివ్ రెమెడీని ట్రై చేస్తే చాలా సుల‌భంగా అండర్ ఆర్మ్స్ నలుపును పోగొట్టుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో వ‌న్ టేబుల్ స్పూన్ ఓట్స్‌, రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజ‌లు వేసుకుని ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికిస్తే జెల్లీగా మారుతుంది.

అప్పుడు స్ట‌వ్ ఆఫ్ చేసి.ఉడికించుకున్న మిశ్ర‌మాన్ని చ‌ల్లారబెట్టుకోవాలి.

Advertisement
Effective Home Remedy For Dark Underarms! Home Remedy, Dark Underarms, Underarms

పూర్తిగా కూల్ అయ్యాక‌.దాని నుంచి జెల్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

Effective Home Remedy For Dark Underarms Home Remedy, Dark Underarms, Underarms

ఇప్పుడు ఈ జెల్‌లో రెండు టేబుల్ స్పూన్ల శ‌న‌గ‌పిండి, వ‌న్ టేబుట్ స్పూన్ల పెస‌ర‌పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానికి ప‌సుపు, వ‌న్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని అన్నీ క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని అండ‌ర్ ఆర్మ్స్‌లో అప్లై చేసుకుని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఆర‌నివ్వాలి.ఆపై సున్నితంగా వేళ్ల‌తో స్క్ర‌బ్ చేసుకుంటూ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

అనంత‌రం ఏదైనా మాయిశ్చ‌రైజ‌ర్ లేదా లోష‌న్‌ను అప్లై చేసుకోవాలి.ఇలా మూడు రోజుల‌కు ఒక‌సారి చేస్తే న‌లుపు క్ర‌మంగా త‌గ్గిపోతుంది.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement

తాజా వార్తలు