రంగంలోకి ఈడీ.. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.పేపర్ లీకేజీ వ్యవహారంపై విచారణ చేసేందుకు ఈడీ రంగంలోకి దిగింది.

నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ స్టేట్ మెంట్ రికార్డ్ చేసేందుకు అనుమతి కోరుతూ ఈడీ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.విదేశాల నుంచి వచ్చి కొంతమంది పరీక్షలు రాశారన్న అభియోగంపై విచారణ జరగనుంది.

ఈ క్రమంలోనే రూ.కోట్లు హవాలా రూపంలో చేతులు మారినట్లు ఈడీకి టీపీసీసీ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.దీంతో మనీలాండరింగ్ జరిగిందని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది.

ఈ నేపథ్యంలో సిట్ సాక్షిగా పేర్కొన్న శంకర్ లక్ష్మీపై ఈడీ దృష్టి సారించిందని సమాచారం.విచారణలో భాగంగా శంకర్ లక్ష్మీతో పాటు టీఎస్పీఎస్సీకి చెందిన సత్యనారాయణకు ఈడీ నోటీసులు జారీ చేసిందని తెలుస్తోంది.

Advertisement

అదేవిధంగా నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ లను కస్టడీకి తీసుకుని ఈడీ విచారించనుంది.

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి
Advertisement

తాజా వార్తలు