ఆర్థిక పరిస్థితుల నుంచి గట్టేందుకు అడ్డదారులు రైతు బీమా కాజేశాడు.తన ఇంట్లో పనిచేసే మహిళలు చనిపోయినట్టు ఫేక్ డాక్యుమెంట్లు(దస్తావేజులు) సృష్టించి 5 లక్షలు కాజేశాడు ఓ ప్రబుద్ధుడు వివరాల్లోకి వెళితే.
కుల్కచర్ల మండల పరిధిలోని పుట్టాపహాడ్ చెందిన రాఘవేందర్ రెడ్డి ఆ గ్రామంలో వ్యవసాయం చేయడంతోపాటు రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.అతనికి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి ఈజీగా డబ్బులు సంపాదించి పెట్టాలని ఉద్దేశంతో తప్పుడు మార్గం ఎంచుకున్నాడు.
చంద్రమ్మ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని బతికుండగానే చంద్రమ్మ అనే మహిళలు చనిపోయినట్టుగా రికార్డుల్లో నమోదు చేసి ఆమె పేరు వచ్చిన రైతు బీమా డబ్బులు కాజేశాడు.రాఘవేంద్ర రెడ్డి ఇంట్లో చాలా కాలంగా చంద్రమ్మ పనిచేస్తుంది.
ఈమెకు ఒక కుమారుడు కొడుకు నిరక్షరాస్యుడు, అమాయకత్వమైన చంద్రమ్మ ను ఆసరాగా చూసుకొని పక్కా ప్లాన్ తో ఆమె పేరున రైతు బీమా కాజేశాడు.
భీమా డబ్బులు రావాలంటే బాధితురాలు అయిపోయినట్టుగా ప్రభుత్వానికి చూపించాలి.
అయితే చంద్రమ్మ చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికెట్ నిరూపించి ఫోర్జరీ సంతకాలతో సర్టిఫికెట్ తయారుచేశాడు.సదరు బాధితులు రాఘవేందర్ రెడ్డి లో పనిచేయడంతో ఏదో అవసరం ఉందని నమ్మచి వారి నుంచి ఆధార్ కార్డు తెప్పించుకొని పని చాలా సులువుగా పూర్తి చేశాడు.
అన్ని వివరాలతో రైతు బీమాకు అన్ని ఫేక్ పత్రాలు అప్ లోడ్ చేసి రైతు బీమా కు దరఖాస్తు చేశాడు.అధికారులు ఏ ఈ ఓ రాఘవేందర్ రెడ్డికి ఫోన్ చేయగా చంద్రన్న మృతిచెందిన విషయం వాస్తవమని తెలపడంతో సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేశాడు.
చివరికి రైతు బీమా డబ్బులు నొక్కేసాడు.చంద్రమ్మకు ప్రతియేటా పడే రైతుబంధు డబ్బులు ఈ సంవత్సరం జమకాలేదు.
దీంతో ఆమె కుమారుడు రైతుబంధు డబ్బులు విషయమై పలుమార్లు అడిగిన అతను స్పందించకపోవడంతో వ్యవసాయ కార్యాలయం కి వెళ్ళి విచారించగా అసలు విషయం బయటపడింది.కేసు నమోదు చేసి పోలీసులు నిందితుడిని ఆదివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.