లగడపాటి సర్వే వచ్చేసింది ! గెలిచేది... గెలవబోయేది వీరేనట !

ఆంధ్రా ఆక్టోపస్ గా బిరుదు పొందిన లగడపాటి రాజగోపాల్ కు దేశవ్యాప్తంగా పేరుంది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అందునా రాజకీయ పార్టీల దృష్టిలో అయితే లగడపాటికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.

ఇంతకీ ఎందుకు ఆయనకు అంత డిమాండ్ అంటే.ఆయన చేయించే పొలిటికల్ సర్వేలతోనే.

ఫలితాలకు దగ్గరగా ఉండేలా ఆయన సర్వే ఫలితాలు ఉండడం అందరిలోనూ ఆసక్తి కలగడానికి కారణం.

తాజాగా .తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఇవాళ వెల్లడించారు లడగపాటి.తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న లగడపాటి రాజగోపాల్ ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ సర్వే ఫలితాలను వెల్లడించారు.

Advertisement

తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రలోభాలకు లొంగకుండా.ప్రజలు ఇండిపెండెంట్ అభ్యర్దులకు ఎన్నికలలో ఓట్లు వేయబోతున్నారన్న లగడపాటి.

ఈ ఎన్నికల్లో 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవబోతున్నారని సంచలన ప్రకటన చేశారు.

ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట్ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన శివకుమార్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన జాదవ్ అనిల్ కుమార్.ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారని తెలిపారు లడగపాటి.తెలంగాణ ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆసక్తిగా ఉన్నారని, డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం పూర్తి ఫలితాలు ప్రకటిస్తానన్నారు.

అంతే కాకుండా తెలంగాణాలో గెలిచే అభ్యర్థుల పేర్లను రోజుకి రెండు చప్పున విడుదల చేస్తానంటూ ప్రకటించారు.

డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ లెక్కలివే.. అన్ని కోట్లు వస్తే హిట్టవుతుందా?
Advertisement

తాజా వార్తలు