జగన్ సరికొత్త నినాదం...కలిసివస్తుందా..??

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రోజురోజుకి కొత్త రూపు సంతరించుకుంటున్నాయి.తెలంగాణలో మరొక వారం రోజుల్లో నే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రచార పర్వం జోరుగా సాగుతోంది.

 Ys Jagan New Strategy Targets Bjp And Janasena-TeluguStop.com

ఏపీలో మరొక ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో ప్రధాన పార్టీలు భవిష్యత్తు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.నిన్నటి వరకు చంద్రబాబుని వన్ సైడ్ గా ఏకేసిన పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి పై కూడా వ్యూహాత్మకంగా మాటల దాడి చేయడంతో రాజకీయం మరింత రంజు గా మారింది.

ఒక పక్క చంద్రబాబు నాయుడు ఏపీలో బీజేపీ వైసీపీ, జనసేన మూడు పార్టీలు ఒక్కటేనని ప్రచారం చేయడం జగన్ కు భారీ నష్టం కలగ చేస్తుండటంతో జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాన్ని మార్చుకున్నారని తెలుస్తోంది…దాంతో చంద్రబాబు, పవన్, బిజెపి మూడు పార్టీలను ఏకకాలంలో టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.అందులో భాగంగానే జగన్ రెడ్డి తన ప్రచారంలో పదునైన వ్యాఖ్యలతో ఆ మూడు పార్టీలను ఏకేస్తున్నాడు.టిడిపి, జనసేన ,బిజెపిలను నమ్మవద్దు అంటూ వారికి ఓటు వేయవద్దు అంటూ కొత్త నినాదంతో ముందుకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి.

2014 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు ఒక్కటిగా చేరి ఏపీలో విస్తృత ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాయి అయితే ఆనాటి ప్రచారంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక మాత్రం మర్చిపోయారని జగన్ ఆరోపణ చేస్తున్నారు.అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే చంద్రబాబు, మోడీ, పవన్ ఈ ముగ్గురు కలిసికట్టుగా గత ఎన్నికల్లో ప్రచారం చేయడం వల్లనే ఏపీలో టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చింది అనేది వాస్తవం.అయితే ఆ తరువాత ఏపీకి ఎంతటి భారీ నష్టం కలిగింది కూడా అందరికీ తెలిసిందే.

ఇదే విషయాన్ని జగన్ గనుక ప్రజల్లోకి తీసుకెళ్లి.ఆ మూడు పార్టీలు ఒక్కటేనని విషయాన్ని ప్రచారం చేయగలిగితే.

తప్పకుండా జగన్ సక్సెస్ అవుతారు.ఇప్పుడు ఇదే వ్యూహాన్ని ఏపీలో జగన్ మోహన్ రెడ్డి అమలు చేయనున్నారని తెలుస్తోంది…మరి జగన్ వ్యూహాలు అమలు అవుతాయా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube