'హనుమాన్' నుండి తేజ సజ్జ స్టైలిష్ పోస్టర్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?

మన టాలీవుడ్ నుండి రాబోతున్న బిగ్గెస్ట్ విజువల్ అండ్ గ్రాఫిక్స్ కలిగిన సినిమా ఏది అంటే ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న హనుమాన్ ( HanuMan ) అనే చెప్పాలి.

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా ( Teja Sajja )అమృత అయ్యర్ ( Amritha Aiyer ) హీరోయిన్ గా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ హను-మాన్.

ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.టీజర్ రిలీజ్ తో అంచనాలు భారీగా పెంచుకున్న ఈ సినిమా పాన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది.

ప్రస్తుతం మేకర్స్ ఇదే ప్రిపరేషన్స్ లో బిజీగా ఉన్నారు.

టీజర్ రిలీజ్( HanuMan Teaser ) తో అంచనాలు భారీగా పెంచుకున్న ఈ సినిమా పాన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆడియెన్స్ కు ఒక విజువల్ వండర్ ను ఇవ్వాలని కష్ట పడుతున్నాడు.తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ దసరా శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేసారు.ఈసారి హీరోగా నటిస్తున్న తేజ సజ్జ స్టైలిస్ట్ పోస్టర్ ను విడుదల చేసారు.

Advertisement

మరి ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాలకు డిఫరెంట్ గా ఈ పోస్టర్ ఉంది.తేజ సజ్జ స్టైలిష్ మేకోవర్ ఆకట్టుకుంటుంది.

కోర మీసంతో, కళ్ళజోడు పెట్టుకుని ఉన్న ఈ పోస్టర్( Teja Sajja HanuMan Poster ) ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టు కుంటుంది.దసరా పండుగ నేపథ్యంలో ఈ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ట్రైలర్ అప్డేట్ కూడా ఇచ్చారు.అతి త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.2024 జనవరి 12న రిలీజ్ చేయనున్న ఈ మూవీ సంక్రాంతి పోటీలో స్టార్ హీరోలను ఎలా తట్టుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు