నవరాత్రి పూజలో భాగంగా అమ్మవారి అలంకరణ పూజా విధానం..!

దేశవ్యాప్తంగా హిందువులు తొమ్మిది రోజులపాటు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగలలో నవరాత్రి ఒక ఒకటి.

నవరాత్రులలో భాగంగా దుర్గామాతను వివిధ రూపాలలో అలంకరణ చేసి, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలు,వస్త్రాలను సమర్పించే భక్తులు ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

అదేవిధంగా ఈ నవరాత్రి ఉత్సవాలు చేసేవారు ఉపవాసంతో అమ్మవారికి పూజలు చేస్తూ అమ్మవారి సేవలో పాల్గొంటారు.ఇక నవరాత్రులలో భాగంగా నాలుగవ రోజు అమ్మవారు ఏ అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

అమ్మవారికి ఏ విధమైనటువంటి నైవేద్యం సమర్పించాలి.పూజ చేయడానికి అనువైన సమయం ఏది అనే విషయాల గురించి తెలుసుకుందాం.

నవరాత్రులలో నాలుగవ రోజులో భాగంగా ఆశ్వియుజ శుద్ధ చతుర్ధి, ఆదివారం.ఈరోజు అమ్మవారిని లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణలో దర్శనమిస్తుంది.

Advertisement

 నేడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు వస్త్రాలను సమర్పించాలి.అదేవిధంగా అమ్మవారికి దద్ధోజనం క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించాలి.ఇంకా పూజలో అమ్మవారికి పూజ చేయడానికి పూజా సమయం ఉదయం 6.05 నుంచి 7.00 వరకు.అలాగే 9.55 నుంచి 11.35 సాయంత్రం 6 నుంచి 8.10 వరకు ఎంతో అనువైన సమయం.ఇక పూజలో భాగంగా అమ్మవారికి జాజి పూలతో పూజ చేయాలి.

అదేవిధంగా పూజలో భాగంగా పెళ్లయినా మహిళలు అమ్మవారికి కుంకుమార్చన చేయడం శుభకరం.ఇకపోతే పూజ తర్వాత లలితా సహస్ర పారాయణం శ్రీచక్ర ఆరాధన నామాలను చేయటం మంచిది.

ఈ రోజు అమ్మవారిని కుష్మాండ దుర్గాదేవి రూపంలో కూడా పూజిస్తారు.ఇంట్లో పూజ అనంతరం అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోవడం ఎంతో మంచిది.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు