సల్మాన్ కోసం ఏకంగా ఆ పని చేసిన ఈ లేడీ ప్రొడ్యూసర్

ప్రస్తుతం కరోనా ఎంతలా విజ్రుంభిస్తున్నదో మనం చూస్తున్నాం.ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితిని కళ్ళారా చూస్తున్నాం.

అయితే మొదటి దశ కరోనా వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే కరోనా నుండి కోలుకుంటున్న అన్ని రంగాలు సెకండ్ వేవ్ తో మళ్ళీ మొదటి దశకు చేరుకున్నాయి.గతంలో కంటే తొందరగా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో ఎక్కడికక్కడ అప్రకటిత లాక్ డౌన్ తో ప్రజలు ప్రాణభయంతో అల్లాడుతున్న పరిస్థితి నెలకొంది.

అయితే ముఖ్యంగా కరోనా ప్రభావం వల్ల దెబ్బతిన్న రంగాలలో సినిమా పరిశ్రమ ఒకటి.మొదటి దశ కరోనా సమయంలో షూటింగ్స్ అన్ని వాయిదా వేసుకొని ఇప్పుడిప్పుడే షూటింగ్స్ నిర్వహించుకునేందుకు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనుకున్న పరిస్థితులలో మరల షూటింగ్స్ కి వాయిదా పడింది.

చాలా సినిమాలు షూటింగ్స్ ని నిలిపివేశాయి.ఇంతటి క్లిష్ట సమయంలో ధైర్యం చేసి షూటింగ్స్ నిర్వహించే అవకాశం లేదు.

Advertisement

కాని ఓ లేడీ ప్రొడ్యూసర్ రిస్క్ చేస్తోంది.ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ లో స్వప్న దత్ నిర్మాతగా ఇంతటి క్లిష్ట పరిస్థితులలో కూడా కాశ్మీర్ లో షూటింగ్ నిర్వహిస్తున్నారు.

ఏది ఏమైనా స్వప్న దత్ ధైర్యానికి సినిమా జనాలు విస్మయానికి గురయ్యారని చెప్పవచ్చు.ఇంతటి కఠిన పరిస్థితులలో సినిమా నిర్మించడం ఏంటని భిన్నమైన వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు