దుబ్బాక విన్న‌ర్ ఎవ‌రు.... ఆ పార్టీకి టెన్ష‌న్ స్టార్ట్ అయ్యింది...!

ఏపీలో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక దేశ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన ఆ ఎన్నిక‌ల్లో అధికార టీడీపీ ధ‌న‌, అధికార బ‌లాలు ఉప‌యోగించింది.

 Dubbaka Elections Survey, Exit Polls, Dubbaka Elections , Trs, Bjp, Ycp, Congres-TeluguStop.com

చివ‌ర‌కు ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్య‌ర్థి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి 27 వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించాడు.ఇక ఇప్పుడు తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక కూడా అంతే ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగింది.

ఓ వైపు బిహార్ ఎన్నిక‌లు, మ‌రోవైపు అమెరికా ఎన్నిక‌లు జ‌రుగుతున్నా కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల దృష్టంతా దుబ్బాక ఉప ఎన్నిక‌మీదే ఉంది.మూడు పార్టీలు పోటీలో ఉన్నా టీఆర్ఎస్‌, బీజేపీ అభ్య‌ర్థులు ఇద్ద‌రు కొద‌మ‌సింహాల్లా త‌ల‌ప‌డ్డారు.

ఇక బీజేపీ శ్రేణుల‌ను ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అక్క‌డ మోహ‌రించ‌డంతో దుబ్బాకలో ప్ర‌చారం హోరెత్తింది.అటు టీఆర్ఎస్ నుంచి మంత్రి హ‌రీష్‌రావు అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు.

ఈ ఉప ఎన్నిక ఫ‌లితం హ‌రీష్‌రావుకు ఇజ్జ‌త్‌కా స‌వాల్‌గా మార‌డంతో హ‌రీష్ రావే దుబ్బాక‌లో పోటీ చేస్తున్నట్టుగా ఉప ఎన్నిక జ‌రిగింది.

Telugu Congress, Dubbaka, Exit, Harish Rao-Telugu Political News

ఇక ఈ ఉప ఎన్నిక‌ల్లో మొత్తం 82 శాతం పోలింగ్ జ‌రిగింది.ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే కొన్ని ఎగ్జిట్‌పోల్స్ సంస్థ‌లు కూడా త‌మ ఫ‌లితం చెప్పేశాయి.టీఆర్ఎస్ గెలుస్తుంద‌ని థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ (నాగన్న) సంస్థ ప్ర‌క‌టించింది.51-54 శాతం ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు తొలిస్థానం లభించగా.33-36 శాతం ఓట్లతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ కు రెండో స్థానం వస్తుందని తెలిపింది.8-11 శాతం ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస రెడ్డి కి మూడో స్థానంలో ఉంటాడ‌ని  ఈ సర్వే చెప్పింది.
ఇక పొలిటిక‌ల్ ల్యాబోరేట‌రీ సంస్థ ఎగ్జిట్‌పోల్స్‌లో బీజేపీ గెలుస్తుంద‌ని తేలింది.47 శాతం ఓట్లతో బీజేపీకి మొదటి స్థానం, 38 ఓట్ల‌తో టీఆర్ఎస్ రెండో స్థానం, 13 శాతం ఓట్ల‌తో కాంగ్రెస్‌కు మూడో స్థానం వ‌స్తుంది.ఇక మండ‌లాల వారీగా చూస్తే దుబ్బాక‌, చేగుంట‌, న‌ర్సంగి, మిరుదొడ్డి మండ‌లాల్లో బీజేపీకి, రాయ‌పోలు, దౌల్తాబాద్ మండ‌లాల్లో బీజేపీకి మెజార్టీ వ‌స్తుంద‌ట‌.

ఒక్క తొగుట మండ‌లంలో మాత్ర‌మే కాంగ్రెస్‌కు మెజార్టీ వ‌స్తుంద‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు.

ఉప ఎన్నిక ప్రారంభంలో తాము 50 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుస్తామ‌ని.

ల‌క్ష ఓట్ల మెజార్టీ వ‌స్తుంద‌ని ధీమా పోయిన అధికార పార్టీ నేత‌లు పోలింగ్ జ‌రిగిన తీరును బ‌ట్టి డిఫెన్స్‌లోకి వెళ్లిపోయారు.చివ‌ర‌కు ఎగ్జిట్ పోల్స్ సైతం బీజేపీ గెలుస్తుంద‌ని చెప్పాయంటే ఇక్క‌డ బీజేపీ ఎంత గ‌ట్టి పోటీ ఇచ్చిందో తెలుస్తోంది.

ఏదేమైనా దుబ్బాక‌లో పెరిగిన పోలింగ్ యువ‌త‌తో పాటు విద్యావంతులు, ఉన్న‌త వ‌ర్గాలు, హిందువులు బీజేపీకే ఓట్లు వేశార‌న్న చ‌ర్చ న‌డుస్తోంది.దీంతో అధికార టీఆర్ఎస్‌లో టెన్ష‌న్ స్టార్ట్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube