తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో వైకుంఠ ద్వార గుండా కుటుంబ సభ్యులతో కలిసి మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, భారత క్రికెటర్ వి.
వి.ఎస్.లక్ష్మణ్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.దర్శనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధప్రసాదాలు అందజేశారు.