తన ఎంపీ పదవికి రాజీనామా చేయబోతున్నాను అంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రెండు రోజుల క్రితమే ప్రకటించారు.అంతే కాదు మళ్లీ తిరిగి నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని, తప్పకుండా గెలుస్తానని ధీమాగా చెప్పారు.
రఘురామకృష్ణంరాజు 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచినా, కొంతకాలం మాత్రమే వైసిపి కంట్రోల్ లో ఉన్నారు.ఆ తరువాత వైసీపీ ప్రభుత్వాన్ని.
జగన్ ను టార్గెట్ చేసుకుంటూ ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు.ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి , ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారు.
దీనికి జనసేన ,టీడీపీ మద్దతు ఇస్తాయని, తప్పకుండా విజయం తమకే దక్కుతుంది అంటూ ధీమా ను వ్యక్తం చేశారు.
అయితే రఘురామకృష్ణంరాజు బీజేపీలో చేరడాన్ని ఆ పార్టీ స్వాగతిస్తున్న , ఇప్పటికిప్పుడు ఎంపీ పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తాను అన్న విషయంలోనే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
అసలు రఘురామ రాజీనామా చేయడానికి గల కారణాలు విశ్లేషిస్తే.ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసిపి లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది.ఆయనపై అనర్హత వేటు వేయాలని పదేపదే కోరుతోంది.దీంతో ఆయనపై అనర్హత వేటు పడుతుంది అంటూ టిడిపి లో కొంతమంది.
నాయకులు రఘురామ పై ఒత్తిడి చేశారని, అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
తాను ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవడం వల్ల వైసిపి తీవ్రంగా నష్టపోతుందని , టిడిపి జనసేన తనకు మద్దతు ఇస్తాయని రఘురామ భావించారు.అయితే రఘురామ టిడిపి సూచనలతోనే ఇప్పుడు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నారని భావించే రఘురామ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో ఈ విషయంపై ఏం చేయాలనే సందిగ్ధంలో రఘురామ ఉన్నారట.