ఎల్లారెడ్డిపేట మండలంలో డ్రై డే కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో అల్మాస్పూర్, కంచర్ల గ్రామాలలో వైద్య అధికారాలు డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో డ్రైడే కార్యక్రమం శనివారం నిర్వహించారు.

డీఎంహెచ్వో డాక్టర్ సుమన్మోహనరావు పారిశుధ్యన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.వర్షాకాలం ఉన్నందున మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, ప్రతి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా ప్రతిరోజు డ్రై డే గా కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

అలాగే సంక్షేమ హాస్టళ్లలో దోమల నివారణకు మందులు స్ప్రే చేయాలని, పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రార్థన సమయంలో డెంగ్యూ, మలేరియా వ్యాధులు, నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై వివరించాలని, వారు తమ ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పేలా చూడాలని తెలిపారు.

ఈ కార్యక్రమములో డి ఎం హెచ్ ఓ తో పాటు,లింగం హెచ్ ఈ ఓ ,డా.చిరంజీవి, ఎం ఎల్ హెచ్ పి స్నేహ, పద్మ సూపర్‌వైజర్, రమేష్ హెల్త్ అసిస్టెంట్, ఏఎన్ఎం లు సుమలత, రూతమ్మ, ఆశా రాణి,మమత,మనీషా లు ఉన్నారు.

Advertisement
సిరిసిల్ల తెలంగాణ భవన్ లో ఘనంగా పివి నరసింహారావు జయంతి

Latest Rajanna Sircilla News