ద్రోణవల్లి హారిక.. చదరంగంలో మరో ఘట్టానికి చేరిక..!

ద్రోణవల్లి హారిక ఈ పేరు తెలుగు రాష్ట్రాల నుంచి దాటి చిన్న వయసు లోనే చదరంగం పోటీలలో తన పేరును చిరస్మరణీయం గా మార్చుకుంది.2017 వ సంవత్సరం ఇరాన్ లో జరిగిన ప్రపంచ చదరంగం ఛాంపియన్ షిప్ లో ద్రోణవల్లి హారిక కాంస్యం సాధించింది.

2016 లో చైనాలో నిర్వహించిన ఫిడే ఉమెన్ గ్రాండ్ ప్రి లో స్వర్ణ పతకం సాధించింది.2015 లో ప్రపంచ మహిళల ఆన్లైన్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్ లో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించింది.ఉమెన్ ఆసియా టీమ్ చెస్ ఛాంపియన్ షిప్ లో వ్యక్తిగత ర్యాపిడ్ విభాగంలో స్వర్ణ పతకం దక్కించుకుంది.

ఇప్పుడు మరో ఘనత సాధించింది హారిక.ఫైడ్ ఆన్‌ లైన్ ఒలింపియాడ్ లో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

ఈ ఈ విషయాన్ని స్వయంగా తానే ట్విట్టర్ వేదికగా అభిమానులకు తెలియజేసింది.చేరుకోవడానికి కఠినమైన శ్రమ చేశానని.

ఇంకా ఇప్పుడు కఠినమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి ఇంకా ఎక్కువ కఠినమైన పోరాటం చేస్తే మంచిదని ట్విట్టర్ లో తెలిపారు.హారిక ముంబై లో 2003లో జరిగిన కామన్ వెల్త్ చదరంగపు క్రీడలలో మహిళా విభాగములో రెండవ స్థానము పొందింది.2007లో భారత ప్రభుత్వము అర్జున పురస్కారముతో హారిక ను గౌరవించింది.అంతే కాకుండా 2019లో పద్మశ్రీ పురస్కారం తన సొంతం చేసుకుంది.

Advertisement

హారిక ప్రస్థానం 1991 జనవరి 12 న గుంటూరులో జన్మించింది.చిన్నప్పటి నుంచే చదరంగం పై ఇష్టం పెంచుకున్న హారిక అండర్ -9 నేషనల్ ఛాంపియన్షిప్ లో పతకం సాధించింది.

ఆ తర్వాత పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఎన్నో పతకాలు సాధించింది .కోనేరు హంపి తర్వాత గ్రాండ్ మాస్టర్ హోదాను పొందిన రెండో మహిళా క్రీడాకారిణి.కరోనాపై పోరాటానికి అండగా నిలిచేందుకు దేశంలోని అగ్రశ్రేణి చెస్‌ ప్లేయర్లు పాల్గొన్న ఆన్‌లైన్‌ చెస్‌ ఎగ్జిబిషన్‌ టోర్నీ ద్వారా పోగైన రూ.4.5 లక్షల విరాళాలను ప్రధానమంత్రి సహాయనిధికి అందించారు.విరాళాల సేకరణ కోసం జరిగిన ఆ టోర్నీలో విశ్వనాథన్‌ ఆనంద్‌, విదిత్‌ గుజరాతి, అధిబన్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన గ్రాండ్‌మాస్టర్లు హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక.

చెస్‌.కామ్‌ వేదికగా ఉత్సాహవంతులతో పోటీపడ్డారు.

ఈ సంగతి తెలిస్తే, మీరు ఇక పానీపూరి బండివంక కన్నెత్తి కూడా చూడరు!
Advertisement

తాజా వార్తలు