హెచ్1 బీ వీసాదారులకు ఊరట: సడలింపులిచ్చిన ట్రంప్ ప్రభుత్వం, కానీ...!!!

హెచ్ 1 బీ వీసాల విషయంలో తొలి నుంచి కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త దయ చూపారు.

హెచ్ 1 బీ వీసా నిషేధంపై కొన్ని షరతులతో కూడిన మినహాయింపులను ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.

దీనిలో భాగంగా వీసాలపై నిషేధం కంటే ముందు చేసిన ఉద్యోగాల్లోకి తిరిగి వచ్చే వీసాదారులు అమెరికాలోకి ప్రవేశించడానికి అనుమతిస్తామని ఫెడరల్ ప్రభుత్వం వెల్లడించింది.వీసాదారులతో పాటు వారిపై ఆధారపడ్డ జీవిత భాగస్వాములు, పిల్లలు కూడా వెంట రావచ్చని అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ అడ్వైజరీ స్పష్టం చేసింది.

వీరితో పాటు హెచ్ 1 బీ వీసాలు కలిగి ఉన్న సాంకేతిక నిపుణులు, ఉన్నత స్థాయి మేనేజర్లు, ఇతర విభాగాల్లో విధులు నిర్వర్తించే వారికి ట్రంప్ అనుమతినిచ్చారు.విదేశాల్లో చిక్కుకుపోయిన హెచ్ 1 బీ వీసాదారులు అమెరికాలో ఉద్యోగాలకు తిరిగి వస్తే వీసాలు పొందటానికి అవకాశం కల్పిస్తామని ఇమ్మిగ్రేషన్ అటార్నీ గ్రెగ్ సిస్కిండ్ ట్వీట్ చేశారు.

ఈ నిర్ణయం అమెరికా తక్షణ, నిరంతర ఆర్ధిక పునరుద్దరణకు దోహదం చేస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.కాగా ఈ ఏడాది చివరి వరకు విదేశీయులకు జారీ చేసే హెచ్ 1 బీ వీసాలపై ట్రంప్ సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే.

Advertisement

ఆయన నిర్ణయం కారణంగా ఈ ఏడాది విదేశీయులు అమెరికాకు వెళ్లి ఉద్యోగం చేసే అవకాశం లేదు.దీని ప్రభావం ఎక్కువగా టెక్ కంపెనీలపైనే పడింది.

ఆయన తీరుపై అక్కడ ప్రతిపక్షాలతో పాటు విదేశీ పౌర సమాజం కూడా మండిపడుతోంది.ఈ క్రమంలో అధ్యక్షుడి నిర్ణయానికి వ్యతిరేకంగా అక్కడి టెక్ కంపెనీలు కోర్టుకు వెళ్లాయి.అమెజాన్, ఫేస్‌బుక్, యాపిల్‌తో వంటి దిగ్గజాలతో సహా 50కి పైగా కంపెనీలు కోర్టు ఫైలింగ్‌పై సంతకాలు చేశాయి.

దీని వల్ల విదేశీయుల కంటే ఎక్కువగా అమెరికన్ ఉద్యోగులకు, అమెరికన్ కంపెనీలకు, దేశ ఆర్ధిక రంగానికి ఎక్కువగా నష్టం కలుగుతుందని వారు న్యాయస్థానానికి తెలియజేశారు.అధ్యక్షుని చర్యల కారణంగా విదేశీయులకు తప్పుడు సంకేతాలు వెళతాయని.

దీనిని అవకాశంగా తీసుకుని ఇతర దేశాలు లబ్ధి పొందాలని చూస్తున్నాయని కంపెనీలు ఆవేదన వ్యక్తం చేశాయి.

మా అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం.. కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లో తీర్మానం
Advertisement

తాజా వార్తలు