ట్రంప్ ప్యాంట్ పై సరికొత్త వివాదం...సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో...!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు.

అధ్యక్ష భవనం నుంచీ బయటకు వచ్చిన తరువాత పెద్దగా వార్తల్లో కనపడని ట్రంప్ 2024 ఎన్నికలు టార్గెట్ గా ఇప్పటి నుంచే పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.

బిడెన్ పాలన పై తనదైన శైలిలో ఛలోక్తులు విసురుతూ, విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.అగ్ర స్థానంలో ఉన్న అమెరికాను పాతాళానికి తోక్కేస్తున్నారు, చైనాకు సలాం కొడుతున్నారు, బిడెన్ అమెరికా పరువు తీస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్సలకు దిగారు, చైనా వలనే అమెరికాకు కరోనా భారీ నష్టం కలిగిందని, వూహాన్ ల్యాబ్ లోనే వైరస్ పుట్టిందని ఆధారాలు కనపడుతున్నా బిడెన్ ఇప్పటి వరకూ స్పందించడం లేదని విమర్శలు చేశారు.

అయితే ట్రంప్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి, ట్రంప్ ను నవ్వుల పాలు చేయడానికి పలువురు సోషల్ మీడియాలో ట్రంప్ ఫ్యాంట్ పై వింత చర్చ పెట్టారు.అమెరికా అధ్యక్షుడుగా వైదొలగిన తరువాత ట్రంప్ మొదటి సారిగా అమెరికాలోని నార్త్ కరోలినాలోని గ్రీన్ విల్లెలో పర్యటించి భహిరంగ సభ ఏర్పాటు చేసిన ట్రంప్ యధావిధిగా బిడెన్ పై విమర్శలు చేపట్టారు.

అయితే ట్రంప్ విమర్శలను తప్పు దోవ పట్టించే క్రమంలో సోషల్ మీడియాలో ట్రంప్ వెసుకున్న ప్యాంట్ ఫోటోలు లతో వింత చర్చ పెట్టారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Advertisement

ఇంతకీ విషయం ఏమిటంటే ఈ ఫోటోలలో ట్రంప్ ప్యాంట్ వెనకది ముందుకు ముందుది వెనక్కి వేసుకున్నట్టుగా ఉంది.దాంతో

ట్రంప్ పై విమర్శలు చేయడానికి సిద్దంగా ఉన్న వాళ్ళందరూ ట్రంప్ ను ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు.ట్రంప్ కు రాజకీయాలు ఎందుకు ముందు ప్యాంట్ వేసుకోవడం నేర్చుకోమని చెప్పండి అంటూ కామెంట్స్ చేశారు ఈ క్రమంలో అలెర్ట్ అయిన ట్రంప్ సిబ్బంది అందుకు సంభందించిన హై క్వాలిటీ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టారు.కావాలని ట్రంప్ ప్రతిష్టను దిగాజార్చడానికి మార్ఫ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టారని ట్రంప్ కు వస్తున్న ఆదరణ , ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ చేశారని వివరణ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు