వెన్న‌తో ఇలా చేస్తే మీ పిల్ల‌ల జుట్టు ఒత్తుగా పెరగ‌డం ఖాయం!

వెన్న‌.పాల ఉత్ప‌త్తుల్లో ఇది ఒక‌టి.

వెన్న అద్భుత‌మైన రుచిని మాత్ర‌మే కాదు.

విటమిన్ ఎ, విటమిన్‌ డి, విటమిన్‌ ఇ, విటమిన్ కె, కాల్షియం, పొటాషియం, ప్రోటీన్‌, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమెగా–3, ఒమెగా–6 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోష‌కాలెన్నిటినో క‌లిగి ఉంటుంది.

అందుకే వెన్న‌తో వెయ్యి లాభాలు అని పెద్ద‌లు అంటుంటారు.పరిమితంగా తీసుకుంటే వెన్న ఆరోగ్యానికి ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

అలాగే జుట్టు సంర‌క్ష‌ణ‌కు సైతం వెన్న ఉప‌యోగ‌ప‌డుతుంది.ముఖ్యంగా వెన్న‌తో ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా చేస్తే మీ పిల్ల‌ల జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెర‌గ‌డం ఖాయం.

Advertisement
Doing This With Butter Will Help Your Kids Hair Grow Thicker! Kids Hair, Butter,

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం వెన్న‌తో ఏం చేయాలో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల వెన్న‌ను వేసుకోవాలి.

ఆ త‌ర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల ప‌చ్చి పాలు, రెండు టేబుల్ స్పూన్ల ఆముదం, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.

Doing This With Butter Will Help Your Kids Hair Grow Thicker Kids Hair, Butter,

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మీ పిల్ల‌ల జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.రెండు గంట‌ల అనంత‌రం మంచి షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో హెయిర్ వాష్ చేయాలి.ఇలా వారానికి ఒక‌సారి గ‌నుక చేస్తే వెన్న‌లో ఉండే ప‌లు పోష‌కాలు జుట్టుకు బ‌లాన్ని చేకూర్చి ఒత్తుగా, పొడ‌వుగా ఎదిగేందుకు స‌హాయ‌ప‌డ‌తాయి.

Doing This With Butter Will Help Your Kids Hair Grow Thicker Kids Hair, Butter,

ఈ హెయిర్ మాస్క్‌ను పెద్ద‌లు కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు.పెద్ద‌లు వారానికి రెండు సార్లు పైన చెప్పిన హెయిర్ మాస్క్ వేసుకుంటే జుట్టు ఊడ‌టం త‌గ్గి.ఒత్తుగా పెర‌గ‌డం ప్రారంభం అవుతుంది.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

అలాగే వెన్న‌ జుట్టుకు మంచి తేమ‌ను అందిస్తుంది.అందువ‌ల్ల‌, పొడి జుట్టుతో బాధ‌ప‌డేవారు ఈ మాస్క్ ను వేసుకుంటే జుట్టు స్మూత్‌గా, సిల్కీగా మెరుస్తుంది.

Advertisement

తాజా వార్తలు