కుక్కలతో కరోనా వైరస్ కు చెక్... ఎలా అంటే?

ఎక్కడో చైనా లో పుట్టి ప్రపంచ దేశాలన్నింటికీ వ్యాపించి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మన దేశంలోకి రావడంతో దేశం మొత్తం ఒక్కసారిగా దిక్కుతోచని స్థితిలో ఉంది.

కరోనా వైరస్ గుర్తించేందుకు సరైన కిట్లు అందుబాటులో లేక నమూనాలను సేకరించి పరీక్షలకోసం వేరే ప్రాంతాలకు పంపించి, వాటి రిపోర్ట్ వచ్చే సమయానికి వైరస్ మరింత మందికి వ్యాపించడం ద్వారా మన దేశంలో కూడా కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయాయి.

అయితే ఇటువంటి ప్రమాదకరమైన మహమ్మారిని గుర్తించడానికి కుక్కలు ఎంతో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు తెలియజేశారు.వాటిలో ఘ్రాణశక్తి ఎక్కువగా ఉండటం వల్ల కరోనా వైరస్ ను ఖచ్చితంగా గుర్తించగలవని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇందులో భాగంగానే కరోనా వైరస్ ను గుర్తించడానికి ప్రపంచ వ్యాప్తంగా పెద్దఎత్తున శునకాలకు శిక్షణ ఇస్తున్నారు.

శునకాలకు శిక్షణ ఇవ్వడం ద్వారా రద్దీగా ఉన్న ప్రదేశాలలో వైరస్ సోకిన వ్యక్తులను వెంటనే గుర్తించి ఈ మహమ్మారి మరింత వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని తెలియజేశారు.ఈ శునకాల ద్వారా కరోనా వైరస్ ను గుర్తించవచ్చని హోల్గర్ వోల్క్ అనే వెటర్నరీ న్యూరాలజిస్ట్ తెలిపారు.ఈ శునకాలకు వైరస్ సోకిన వ్యక్తి చెమట, వారి అడుగుల ద్వారా ఆ వ్యక్తిని గుర్తించగలిగేటట్లు మొదటగా శిక్షణ ఇచ్చారు.

Advertisement

లెబనాన్, ఫిన్లాండ్‌ల వంటి ప్రాంతాలలో ప్రయాణికుల లో కరోనా లక్షణాలు బయటపడక ముందే శునకాలు వారిని గుర్తించాయని అక్కడి గణాంకాలు తెలియజేస్తున్నాయి.అయితే ఈ శునకాలు గుర్తించిన వారికి తర్వాత కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 92శాతం మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిపారు.

అయితే కరోనా సోకిన వ్యక్తిని గుర్తించడంలో కుక్కలు కీలక పాత్ర పోషిస్తాయని జోసఫ్ యూనివర్సిటీ సర్జన్ ,రీసెర్చర్ రియాద్ సర్కిస్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు