ఇపుడు ట్విటర్‌లో 10 వేల పదాల లిమిట్‌ అనేది వారికి మాత్రమే వర్తిస్తుందా?

ట్విటర్ యూజర్లకు ఈ విషయం గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది.త్వరలో ట్విట్టర్లో కొత్తగా మరో ఫీచర్ అప్డేట్ అందుబాటులోకి రానుంది.

ట్వీట్లో అక్షరాల పరిమితిని త్వరలో 10వేలకు పెంచున్నట్లు ఎలాన్ మస్క్ ఆమధ్య తెలిపారు.దీంతో యూజర్లు ఒకే ట్వీట్లో ఎక్కువ టెక్స్ట్ రాసె అవకాశాన్ని పొందుతారు.

ట్విటర్లో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ మస్క్ ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం.అయితే, ఈ ఫీచర్ ట్విటర్ బ్లూ సబ్స్కబర్లకు మాత్రమేనా? లేక సాధారణ యూజర్లకు సైతం అందుబాటులో ఉంటుందా? అనే విషయం చాలామంది మదిలో మెదులుతుంది.

కాగా టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి రానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇకపోతే, ప్రస్తుతం ట్విటర్లో ఒక ట్వీట్లో అక్షరాల పరిమితి 280గా వున్న సంగతి అందరికీ తెలిసినదే.అదేవిధంగా గతంలో ఈ పరిమితి 140గా ఉండేది.2017లో దాన్ని 280కి పెంచడం జరిగింది.ఈ క్రమంలోనే గతేడాది నాలుగు వేల అక్షరాలకు పెంచారు.

Advertisement

అయితే, ఇది కేవలం అమెరికాలోని ట్విటర్ బ్లూ సబ్సైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.అదేవిధంగా తాజాగా మస్క్ ప్రకటనతో మరోసారి ట్వీట్లో అక్షరాల సంఖ్య పెరగనుందనే విషయం తెలుస్తోంది.

ఈసారి ఏకంగా 10 వేల పదాల లిమిట్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.ఐతే ఈ అవకాశం అనేది కేవలం బ్లూ సబ్సైబర్లకు మాత్రమేనా లేదంటే సాధారణ సబ్సైబర్లకు కూడా అవకాశం ఉందనేది ఇంకా తెలియాల్సి వుంది.ఇకపోతే ట్విటర్ ఆదాయాన్ని పెంచేందుకు మస్క్ ట్విటర్ బ్లూ సబ్స్క్రైబర్లను పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

సబ్స్క్రిప్షన్ రెవెన్యూ లేకుండా ట్విటర్ను కొనసాగించడం సాధ్యం కాదని, ఉద్యోగులతో జరిగిన సమావేశంలో మస్క్ పేర్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి.అయితే, ట్విటర్ బ్లూ మాత్రం మస్క్ ఆశించినంతగా విజయం సాధించలేదని గుసగుసలు వినబడుతున్నాయి.

ఈ నేపథ్యంలో పది వేల అక్షరాల పరిమితి అందరికీనా లేక కొందరికేనా అనే దానిపై ఆసక్తి నెలకొంది.

జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?
Advertisement

తాజా వార్తలు