కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు... మౌనిక కొడుకు గురించి మనోజ్ షాకింగ్ కామెంట్స్!

మంచు మనోజ్ మౌనిక దంపతుల వివాహం తర్వాత పలు ఆలయాలను సందర్శిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు.ఈ క్రమంలోనే వీరి వివాహం జరిగిన వెంటనే కర్నూలుకు చేరుకున్నటువంటి మౌనిక మనోజ్ దంపతులు ఆళ్లగడ్డలోని మౌనిక తల్లిదండ్రుల ఘాట్ వద్దకు చేరుకొని వారికి నివాళులు అర్పించారు.

 Manojs Shocking Comments About Maunikas Son Who Can Walk To Kalisochche Period,-TeluguStop.com

అనంతరం తిరుమల చేరుకున్నటువంటి ఈ దంపతులు శ్రీవారి దర్శనాన్ని చేసుకున్నారు.అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు.

Telugu Dhairav Reddy, Manoj, Maunika, Tirumala-Movie

ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ మౌనికతో తనకు 12 సంవత్సరాల పరిచయం ఉందని గత నాలుగేళ్లుగా వీరిద్దరి ప్రేమకు ఎంతోమంది వ్యతిరేకత చూపించారని, అయినా అందరి ఆశీస్సులు దీవెనల కోసం తాము ఎదురు చూసామని తెలిపారు.ఇక తమ తల్లిదండ్రుల తన అక్క అలాగే పైన ఉన్నటువంటి మౌనిక తల్లిదండ్రుల ఆశీస్సులు ఉన్నంతవరకు తాము క్షేమంగా ఉంటామని మనోజ్ తెలిపారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మనోజ్ మౌనిక కుమారుడి గురించి మాట్లాడుతూ కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతారు అంటారు అదే నిజమైందంటూ ఈయన మౌనిక కుమారుడు ధైరవ్ రెడ్డి గురించి కామెంట్స్ చేశారు.

Telugu Dhairav Reddy, Manoj, Maunika, Tirumala-Movie

ఇలా మౌనిక కుమారుడు గురించి మనోజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.ఇక తనకు సేవ చేయాలని ఉంది కానీ రాజకీయాలలోకి మాత్రం తాను రానని తెలిపారు.ఒకవేళ రాజకీయాలపై ఉన్న ఆసక్తితో మౌనిక రాజకీయాలలోకి వచ్చిన మౌనికకు ఎప్పుడు తన మద్దతు ఉంటుందని మనోజ్ ఈ సందర్భంగా తెలిపారు.

ఇక మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవడంతో ఆమె కుమారుడి బాధ్యత కూడా తనదేనని ఈయన తెలియజేశారు.ఇక మౌనిక కుమారుడు సైతం మనోజ్ తో చాలా ప్రేమగా ఉండటం అందరినీ ఆకట్టుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube