Health Toilets :ఆరోగ్యానికి ఏ టాయిలెట్ మంచిదో తెలుసా? పరిశోధనల్లో తేలిన విషయాలు!

కాలం మారింది.పట్టణాలనుండి పల్లెల వరకు ఇపుడు అందరు సౌకర్యం విషయంలో రాజీ పడటం లేదు.

ఒకప్పుడు పల్లెటూళ్లలో ఉదయాన్నే ముగించాల్సి కార్యక్రమాలకి వూరి బయటకి వెళ్ళవలసి వచ్చేది.కానీ ఇప్పటి జనాలలో బాగా పరిణితి వచ్చింది.

తాము కట్టుకున్న ఇండ్లలోనే పట్టణాల మాదిరి బాత్ రూమ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు.అయితే ఈ నేపథ్యంలోనే నార్మల్ టాయిలెట్ కి బదులుగా కొంతమంది వెస్ట్రన్ టాయిలెట్ ఏర్పాటు చేసుకుంటున్నారు.

అయితే ఈ రెండింటి విషయంలో చాలామందికి కొన్ని రకాల అపోహలు వున్నాయి.అవేమిటో ఇపుడు చూద్దాము.

Advertisement
Do You Know Which Toilet Is Good For Health , Health , Toilets, Good, World Toil

మనలో కొందరు ఇండియన్ టాయిలెట్‌ను ఇష్టపడుతుండగా.మరికొందరు మాత్రం వెస్ట్రన్ టాయిలెట్‌ను ఇష్టపడుతున్నారు.

అయితే ఇందులో దేని ప్రయోజనాలు దానికుంటాయి.ఇలాంటి సందేహాలపై ముందుగా నిపుణులు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం.

ఇండియన్ టాయిలెట్‌లో స్క్వాట్ పొజిషన్‌లో కూర్చున్నప్పుడు, మలాన్ని పూర్తిగా క్లియర్ చేయడానికి ప్రేగులపై ఒత్తిడి పెరుగుతుంది.తద్వారా జీర్ణమైన ఆహారం మలం రూపంలో వున్నది పూర్తిగా పెద్ద పేగుద్వారా వచ్చి కిందకి పడే అవకాశం వుంది.

పొట్ట బాగా క్లీన్ అవుతుంది.

Do You Know Which Toilet Is Good For Health , Health , Toilets, Good, World Toil
వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
ఓరి దేవుడో.. జంతువులు మనుషుల్లా నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. (వీడియో)

ఇక వెస్ట్రన్ టాయిలెట్ విషయానికొస్తే కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది అని చెప్పుకోవాలి.ఒక వ్యక్తి ఇండియన్ టాయిలెట్‌ను ఉపయోగించినప్పుడు.అతని కాలి నుంచి తల వరకు మొత్తం శరీరం ఒత్తిడికి గురవుతుందని ఒక పరిశోధనలో తేలింది.

Advertisement

అయితే వెస్ట్రన్ టాయిలెట్‌లో అలాంటి ఒత్తిడి శాతం అనేది తక్కువ.ఇండియన్ టాయిలెట్‌లో పొట్టను శుభ్రం చేయడానికి 3 నుంచి 3.5 నిమిషాలు పడుతుంది.అయితే వెస్ట్రన్ టాయిలెట్‌లో 5 నుండి 7 నిమిషాలు పడుతుంది.

ఇండియన్ టాయిలెట్‌తో పోలిస్తే వెస్ట్రన్ టాయిలెట్‌కి వెళ్లడం వల్ల మీ శరీరం ఇన్‌ఫెక్షన్ అయ్యే ప్రమాదం వుంది.

తాజా వార్తలు