ఇది విన్నారా..? షుగర్ ఫ్రీ మామిడి పండ్ల ట.. ఎక్కడ పండిచ్చారంటే..?!

మామిడి పండ్ల సీజన్ అంటే అందరికీ చాలా ఇష్టం.ఆ టైంలో రకరకాల మామిడి పండ్లు మార్కెట్ లో వచ్చేస్తాయి.

ఆ మామిడి పండ్లను చూస్తూనే తినాలనిపించేలా ఉంటాయి.మామిడి పండు అంటే అందరికీ విపరీరమైన ఇష్టం.

అయితే డయాబెటీస్ తో బాధపడేవారికి మాత్రం మామిడి పండు తినాలంటే కష్టమే.షుగర్ పెరిగిపోతుందనే భయం వారిలో ఉంటుంది.

చక్కర వ్యాధి ఉన్నవారి కోసం పాకిస్తాన్ లో మూడు రకాల చక్కర రహిత మామిడి పండ్లను రైతులు పండించారు.పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతంలో టాండో అల్లాహార్‌ లోని ఎంహెచ్ పన్వర్ ఫార్మ్స్ అనే ప్రైవేట్ వ్యవసాయ క్షేత్రంలో ఈ మామిడి పండ్లను పండించారు.

Advertisement

మామిడి నిపుణుడు శాస్త్రీయ మార్పు చేసిన మూడు రకాల మామిడి పండ్లను ఆయన ఎప్పటి నుంచో పండిస్తున్నారు.ఆ రైతు పండించిన మామిడి పండ్లకు సోనారో, గ్లెన్, కీట్ అనే పేర్లు పెట్టారు.

షుగర్ తో ఉన్నవారికి రెడీ చేసిన ఈ మామిడి పండ్లు ఇప్పుడు పాకిస్తాన్ మార్కెట్ లో లభిస్తున్నాయి.ఎంహెచ్ పన్వర్ మేనల్లుడు అయిన మామిడి పంటల రైతు గులాం సర్వార్ మీడియాతో కొన్ని విషయాలు పంచుకున్నాడు.

మామిడి, అరటితో సహా పండ్లకు సంబంధించిన పరిశోధనల కోసం పాకిస్తాన్ ప్రభుత్వం సీతారా-ఎ-ఇమ్తియాజ్‌ ను పన్వర్‌ కు ఇచ్చినట్లు తెలిపారు.ఈ వాతావరణంలోనే మట్టిలో వాటి పెరుగుదలను పరీక్షించడానికి కోన్ని రకాల మామిడి పండ్లను విదేశీ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు.

ఆ తర్వాత అందులో మార్పులు చేసి మామిడి పండ్లను పండించారు.ఈ రైతుకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం కూడా అందలేదు.తనకు చెందిన 300 ఎకరాల పొలంలో 44 మామిడి గుణాత్మక రకాలు అందుబాటులో ఉంచినట్లు రైతు వెల్లడించారు.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
పుష్ప 2 పై అంబటి కామెంట్స్ .. వారిని అరెస్ట్ చేయకపోవడంపై ఫైర్ 

చక్కెర వ్యాధిగ్రస్తులకు షుగర్ స్థాయిని నియంత్రించటానికి కొత్త రకాలను పరిచయం చేయడానికి, ఉత్పత్తిని మెరుగుపరచడానికి కొత్త పద్ధతులను కనుగొన్నట్లు తెలిపారు.తన పొలంలో పండించిన కొన్ని రకాల మామిడి పండ్లలో కేవలం 4 - 5 శాతం చక్కెర స్థాయిని కలిగి ఉంటాయని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు