కొత్తగా కొనే షూ బాక్స్ లలో ఉండే ఆ ప్యాకెట్ ఏంటో తెలుసా..?!

మీరు ఎప్పుడన్నా చెప్పులు కొన్నప్పుడు ఆ చెప్పుల బాక్సులలో ఒక తెల్లని చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా దాన్ని ఎప్పుడన్నా గమనించారా.? అయితే ఆ పాకెట్ ఏవో రసాయనాలతో తయారయ్యి ఉటుందని భావించి వాటిని తాకకుండా తీసుకెళ్లి చెత్త బుట్టలో పడేస్తుంటాము.

అసలు ఆ పాకెట్ చెప్పుల బాక్స్ లో ఎందుకు ఇచ్చారు.? దాని వల్ల ఉపయోగం ఏమిటి.? అనేది కూడా చాలామంది ఆలోచించారు.అసలు ఆ ప్యాకెట్ లో ఏమి ఉంటుంది.

దానిని ఎందుకు ఆ చెప్పుల బాక్సులో పెట్టి ఇస్తారు.? అనే విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం.సాధారణంగా చెప్పులు బాక్స్ లలో ఉండే ఆ తెల్లని ప్యాకెట్లను సిలికా జెల్ అనే పేరుతో పిలుస్తారు.

నిజానికి ఈ సంచులు సిలికాన్ డయాక్సైడ్ అనే రసాయనాలతో తయారయ్యి ఉంటాయి.నిజానికి ఈ రసాయనాలలో ఎటువంటి విషపూరిత పదార్థాలు ఉండవు.చెప్పుల బాక్సులో, షూ బాక్సులో తమ ఏర్పడితే వాటిలో బ్యాక్టీరియా, ఫంగస్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

అందుకనే ముందు జాగ్రత్తగా ఆ బాక్సులలో సిలికా జెల్ పాకెట్లను ఉంచుతారు.ఈ సిలికా జెల్ ప్యాకెట్లు ఏమి చేస్తాయంటే చెప్పుల బాక్సలలో ఉండే తేమను పీల్చుకుంటాయి.

Advertisement

అయితే ఈ సిలికా జెల్ ప్యాకెట్లను మన ఇంట్లో నిత్యావసరాలుగా ఉపయోగించుకోవచ్చు.అంతేకాదు వీటివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి.

ఎప్పుడన్నా పొరపాటున మన సెల్ ఫోన్ నీటిలో కనుక పడిపోతే ఆ సెల్ పై సిలికా జెల్ ప్యాకెట్లు ఉంచడం వల్ల లోపల ఉన్న తేమను పూర్తిగా పీల్చుకోవటంలో సిలికా జెల్ మంచిగా ఉపయోగపడుతుంది.ఇలా తేమను పీల్చుకోవడం వల్ల మన ఫోన్ సాధారణ స్థితిలోకి వస్తుంది.

ఈ విధంగా చెప్పుల నుంచి మొదలుకొని అన్ని వస్తువుల విషయంలో దీనిని ఉపయోగించుకోవచ్చు.చూసారు కదా సిలికా జెల్ ప్యాకెట్ ఎలా ఉపయోగపడుతుందో.దీని ఉపయోగం తెలిసాక కూడా బయట డస్ట్ బిన్ లో పారేస్తారా మరి.

వీడియో వైరల్.. సీతమ్మ మెడలో తాళి కట్టిన ఎమ్మెల్యే.. ఆగ్రహిస్తున్న ప్రజలు
Advertisement

తాజా వార్తలు