కుమార్తెలకు తల్లి ఆస్తులపై ఎలాంటి హక్కులు ఉంటాయో తెలుసా..?

చాలామందికి ఆస్తులు( Assets ), ఆర్ధిక విషయాల గురించి సరైన అవగాహన ఉండదు.దీని వల్ల చాలా నష్టపోతూ ఉంటారు కూడా.

ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించి అనేక నిబంధనలు ఉంటాయి.వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతిఒక్కరికీ ఉంటుంది.

ఆస్తులకు సంబంధించి అనేక విషయాలు ఉంటాయి.వారసత్వంగా ఆస్తులు పిల్లలకు వస్తాయి.

అలాగే తండ్రి( Father ) పేరు మీద ఉన్న ఆస్తి కొడుకుల పేరు మీదకు వస్తుందని అందరూ అనుకుంటారు.కానీ కుమార్తెలకు కూడా ఆస్తుల్లో హక్కు ఉంటుంది.

Advertisement

దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా.

పెళ్లి చేసుకుని కూతురు అత్తింటికి వెళ్లిన తర్వాత ఆమెకు తల్లిదండ్రుల ఆస్తి రాదని చాలామంది అనుకుంటారు.అయితే తల్లి చట్టబద్దంగా అమలయ్యే వీలునామా రాయకుండా మరణించిన సందర్భంలో కుమార్తెలకు వర్తించే హక్కులు చాలా ఉన్నాయి.హిందూ వారసత్వ చట్టం 1956( Hindu Succession Act ) ప్రకారం.

వీటికి సంబంధించి అనేక నిబంధనలు ఉన్నాయి.ఒక హిందూ మహిళ చనిపోతే సెక్షన్ 15 ప్రకారం మహిళ ఆస్తి పంపిణీ అవుతుంది.

హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 15()1 ప్రకారం హిందూ మహిళ వారసత్వ క్రమాన్ని నిర్దేశిస్తుంది.ముందు ఆస్తులు కుమారులు, కుమార్తెలు, భర్తకు బదిలీ అవుతాయి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఇక జీవించి ఉన్న పిల్లలు లేదా భర్త వారసులకు వెళ్తాయి.

Advertisement

అలాగే మూడో ప్రాధాన్యంగా చూసుకుంటే భర్తకు వారసులు లేకపోతే ఆస్తులు మరణించిన తల్లి, తండ్రికి చెందుతాయి.ఇక జీవించి ఉన్న తల్లిదండ్రులు లేకపోతే ఆస్తులు తండ్రి వారసులకుక బదిలీ అవుతాయి.ఇక దీనర్థం వివాహం చేసుకున్న హిందూ స్త్రీ వీలునామా రాయకుండా మరణిస్తే ఆమె పిల్లలు, భర్తకు సమానంగా ఆస్తులు వెళతాయి.

దీనికి ఆడ, మగ అనే తేడా ఉండదు.

" autoplay>

తాజా వార్తలు