నాగుల రక్షకుడు సుబ్రమణ్య స్వామి గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

జగన్మాత పార్వతీ దేవి, లయ కారకుడు పరమేశ్వరుల రెండో పుత్రుడు శ్రీ సుబ్రమణ్య స్వామి గురించి మనందరికీ తెలుసు.

అయితే ఆయన నెమలిని వాహనంగా వేలాయుధాన్ని చేతబూని యావత్ దేవతా సైన్యానికి సేనానిగా వ్యవహరిస్తారు.

తన కంటే పెద్దవాడయిన విఘ్నేశ్వరునితో కలిసి శిష్ట రక్షణ కోసం అనేక యుద్ధాలు చేశారు.షణ్ముఖుడికి దక్షిణ భారతంలో గుడులు ఎక్కువగా వున్నాయి.

Do You Know These Things About Lord Subrahmanya Swamy Saviour Of Naga ,subrahman

వీటిలో మహిమాన్వితమైనది కర్ణాటకలోని కుక్కెలో వెలసిన శ్రీసుబ్రమణ్యస్వామి ఆలయం.అయితే ఆ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది.

అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.నాగులకు రక్షకుడు.

Advertisement

నాగులలో శ్రేష్టుడు వాసుకి.ఆయన క్షీర సాగర మధనంలో కవ్వానికి తాడులాగా వ్యవహరించాడు.

గరుత్మంతుడి బారి నుంచి రక్షించాలని కోరుతూ ఇక్కడ కొండల్లో కఠోరమైన తపస్సు చేశాడు.తపస్సుకు అనుగ్రహించిన మహేశ్వరుడు అతనికి వరమివ్వాలని సుబ్రమణ్య స్వామిని ఆదేశిస్తారు.

దీంతో స్కందుడు వాసుకికి ప్రత్యక్షమై కుక్కె క్షేత్రంలో నాగులకు రక్షణ వుంటుందని వరమిస్తాడు.దీంతో నాగులకు ఇది రక్షణ క్షేత్రమైంది.

ఇప్పటికీ ఈ క్షేత్రంలో అనేక వందల సర్పాలను మనం చూడవచ్చు.ఆది సుబ్రమణ్య మందిరంలో అనేక పుట్టలు వుంటాయి.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025

అంతే కాదండోయ్ ఆదిశేషు, వాసుకిలపై స్వామివారు.ప్రధాన మందిరంలోని స్వామి ఆదిశేషు, వాసుకిలపైన వుండి పూజలను అందుకుంటారు.

Advertisement

సర్పదోష నివారణ పూజలకు ఈ క్షేత్రం.ప్రసిద్ధి.

సర్వసంస్కార, నాగ ప్రతిష్ట, ఆశ్లేషబలి.తదితర పూజలను నిర్వహిస్తారు.

తాజా వార్తలు