ట్వీటర్‌ నయా ‘ఓట్‌’ ఫీచర్‌ గురించి తెలుసా?

ట్వీటర్‌ ఓ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది.ఇది వినియోగదారులను ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంది.

అదే డౌన్‌ఓట్, అప్‌ఓట్‌

.అంతేకాదు, ఈ సామాజిక మీడియా మరిన్ని ఫీచర్లను కూడా పరీక్షిస్తోంది.ఆ వివరాలు తెలుసుకుందాం.

ట్వీటర్‌ పరీక్షిస్తోన్న ఈ నయా ఫీచర్‌ యూజర్లను ఎంతో ఆకట్టుకుంటుందని సంస్థ చెబుతోంది.ఇక పై మీ ట్వీట్లకు మద్ధతు తెలిపేవారు అప్‌ఓట్‌ వేస్తే.

యాంటీగా ఉన్నవారు డౌన్‌ఓట్‌ వేసే అవకాశం ఉంటుంది.ఆ సింబల్స్‌ ద్వారా మనకు ఎన్ని అప్‌ఓట్స్, డౌన్‌ఓట్స్‌ వచ్చాయో సులభంగా తెలిసిపోతుంది.

Advertisement
Do You Know The Twitter New Feature..down Vote And Up Vote, Facebook Live Steam

అంతేకాదు వాయిస్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ అనే ఫీచర్‌ను కూడా ట్వీటర్‌ పరీక్షిస్తున్నట్లు తెలిపింది.దీని ద్వారా వినియోగదారులు మల్టిపుల్‌ వాయిస్‌ ఎఫెక్ట›్లతో మార్చుకోవచ్చు.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ కేవలం ఐఓఎస్‌ వినియోగదారులకు మాత్రమే అందుబాటలో ఉందని ట్వీటర్‌ చెప్పింది.మరికొన్ని రోజుల్లో ఆండ్రాయిడ్‌ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపింది.

వాయిస్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఫీచర్‌లో యాప్‌ పరిశోధకులు జేన్‌ మాంచున్‌ వాంగ్‌ తయారు చేశారు.లైవ్‌కు వెళ్లే ముందు ఈ ఫీచర్‌ ద్వారా వాయిస్‌ పిచ్‌ను జత చేయవచ్చు.

Do You Know The Twitter New Feature..down Vote And Up Vote, Facebook Live Steam

ఆ వాయిస్‌ ఎలా ఉంటుందో ముందుగా యూజర్లు ఓసారి టెస్ట్‌ కూడా చేయవచ్చు. స్టీవ్‌ మోసర్‌ ఇలాంటి ఫీచర్‌ను పరిచయం చేశారు.ట్వీటర్‌లో అందుబాటులోకి రానున్న సౌండ్‌ ఎఫెక్ట్స్‌ను కూడా ట్వీటర్‌ ప్లాట్‌ఫాంపై స్టీవ్‌ మోసర్‌ విడుదల చేశారు.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
ఇదేందయ్యా ఇది : చితికి మంటపెట్టగానే చనిపోయిన వ్యక్తి ఇలా చేశాడేంటి?

ఇందులో బీ, కార్టూన్, హీలియం, ఇంకాగ్నిటో, కారోకే, మైక్రోఫోన్స్, ఫోన్, స్పేషియల్, స్టేడియం, స్టేజ్‌ వంటి వాయిస్‌ ఎఫెక్స్‌›్ట ఉన్నాయి.ప్రస్తుతం ఈ ఫీచర్‌ అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో సంస్థ తెలపలేదు.

Advertisement

అప్‌ఓట్, డౌన్‌ఓట్‌ ఫీచర్‌పై మరింత గ్రౌండ్‌ వర్క్‌ చేస్తున్నట్లు ట్వీటర్‌ తెలిపింది.తద్వారా యూజర్లు అర్థం చేసుకోవడానికి మరింత సులభతరం అవుతుంది.

అంతేకాదు డౌన్‌ఓట్‌ పబ్లిక్‌గా అందరికీ కనిపించదని, సదరు వినియోగదారులకు పర్సనల్‌గా కనిపిస్తుందట.కేవలం అప్‌ఓట్లు మాత్రమే ఇతరులకు కూడా కనిపిస్తాయి.

ఈ ఫీచర్‌ కూడా ప్రస్తుతం కేవలం ఐఓఎస్‌ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉందని తెలిపింది.

తాజా వార్తలు