వనంలో వెలిసిన అమ్మవారి జాతర చరిత్ర తెలుసా..?

పైడితల్లమ్మ ఆ అమ్మవారి చరిత్ర తెలుసుకున్నా, వినాలన్నా వారు ఎంతో పుణ్యఫలం చేసుకుని ఉండాలి.

ఆ తల్లిని మదిలో స్మరిస్తూ కోర్కెలు కోరితే అవి కచ్చితంగా తీరుతాయి.

అమ్మవారి భక్తులు ప్రపంచంలో ఎక్కడున్నా పైడితల్లిని దర్శించుకునేందుకు తరలివస్తారు.ఉత్తరాంధ్రలో అంబరాన్ని అంటే జాతర ఏదైనా ఉంది అంటే అది పైడితల్లి అమ్మవారి ఉత్సవం.

గత రెండేళ్లు కరోనా కారణంగా ఇబ్బందులు తప్పలేదు.అందుకే ఈ సారి పక్కాగా జరిపించాల్సిందే ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రతిఏటా వైభవంగా జరిగే ఉత్సవాలను ఈ ఏడాది కూడా సంప్రదాయబద్ధంగా జరపాలని నిర్ణయించుకున్నారు.అయితే ఈ జాతర సుమారు నెల రోజుల పాటు జరుగుతుంది.

Advertisement

ప్రధాన ఘట్టాలైన తోల్లేళ్లు ఉత్సవం అక్టోబర్ 10న అంటే సోమవారం జరగనుంది.సెప్టెంబర్ 21న మొదలయ్యే అమ్మవారి జాతర నవంబర్ 2 వరకు కొనసాగుతుంది.

లక్షలాది మంది తరలివచ్చే జాతరకు దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.పైడి తల్లి అమ్మవారి చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మహారాజుల ఇంట ఆ కనకదుర్గమ్మ పైడితల్లిగా జన్మించింది.అయితే ఎప్పుడూ సామాన్యురాలిలా ప్రజల మధ్యే జీవించింది.

అదే సమయంలో విజయనగరం, బొబ్బిలి రాజ్యాల మధ్య యుద్ధం మొదలైంది.యుద్ధం వద్దని పైడితల్లి చెప్పినా ఎవరూ ఆమె మాట వినలేదు.

అమ్మతోడు ఆస్తి కోసం కాదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్!
మీ ఇంట్లో ఈ వస్తువులు అయిపోతే.. మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడం ఖాయం..!

రెండు రాజ్యాల రాజులూ యుద్ధంలో మరణించడంతో తీవ్ర ఆవేదన చెందిన పైడి తల్లి పెద్ద చెరువులో దూకి అంతర్థానమైంది.

Advertisement

కొన్ని రోజులకు పతివాడ అప్పలనాయుడి కలలో కనిపించిన అమ్మ, తాను చెరువులో విగ్రహ రూపంలో ఉన్నానని చెప్పింది.వెంటనే ఊరంతా వెళ్లి చెరువులో వెతకగా పైడితల్లి అమ్మవారి విగ్రహం కనిపించింది.దాంతో అక్కడే అమ్మవారికి వనం గుడి కట్టి అప్పటినుంచి పూజలు చేస్తున్నారు.

ఇక్కడ జరిగే కొన్ని ఉత్సవాల్లో ప్రసిద్ధమైనది సిరిమాను ఉత్సవం.సిరిమాను అనేది చింతలు తీర్చే చింతచెట్టు మాను.

పైడి తల్లికి ప్రతిరూపంగా ఆలయ పూజారి సిరిమానుపైకి ఎక్కి భక్తులను దీవిస్తారు.

తాజా వార్తలు