Puri Jagannath Petla Umashankar Ganesh: పూరి జగన్నాథ్ తమ్ముడు ఒక ఎమ్మెల్యే అనే విషయం మీకు తెలుసా ?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో పూరి జగన్నాద్ కూడా ఒకరు.కేవలం దర్శకుడిగా మాత్రమే కాదు.

నిర్మాతగా, రచయితగా పూరి కి మంచి పేరు ఉంది.2000 లో వచ్చిన పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాకు దర్శకత్వం వహించిన పూరి 2006 లో మహేష్ బాబు హీరోగా తీసిన పోకిరి సినిమాతో తెలుగు సినిమా చరిత్రను మర్చి పారేసాడు.ఇక పూరి జగన్నాద్ ఇప్పటి వరకు తెలుగు లో 33 సినిమాలకు, కన్నడ లో ఒక సినిమాకు దర్శకత్వం వహించాడు.

అతడు చివరగా తీసిన లైగర్ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.దాంతో తీయబోయే జనగణమన సినిమా కూడా వాయిదా పడే పరిస్థితిలో ఉంది.ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువగా పరాజయాలతో పూరి కెరీర్ కొనసాగుతుంది.

ఎన్నో అంచనాల మధ్య విడుదల అవుతున్న సినిమాలు నిరాశనే మిగులుస్తున్నాయి.ఒకానొక దశలో సినిమాలు నిర్మించడం వలన రోడ్డున పడ్డ పూరి ఆ తర్వాత పుంజుకొని నిలబడ్డాడు.

మళ్లి లైగర్ సినిమా పూరి కి చాల నష్టాన్నే మిగిల్చింది.డిస్ట్రిబ్యూటర్ల తో గొడవలు పెరిగి కేసులు పెట్టుకునే వరకు వచ్చింది.

Advertisement

కానీ పూరి కి మాత్రం తనపైన తనకు చాల నమ్మకం.

దాంతో హీరో రామ్ తో జనగణమన సినిమా తీయాలని అనుకుంటున్నాడు.ఇక పూరి జగన్నాధ్ సంగతి కాసేపు పక్కన పెడితే అయన కు ఇద్దరు తమ్ముళ్లు కూడా ఉన్నారు.అందరి కన్నా చిన్న తమ్ముడు సాయి రామ్ శంకర్.

ఇతడు కూడా హీరో గా పలు సినిమాల్లో నడిచాడు.ఇక బయట ప్రపంచానికి తెలియని ఒక తమ్ముడు ప్రస్తుతం ఎమ్మెల్యే గా కూడా ఉన్నాడు.

ఈ విషయం బయట పెద్దగా ఎవరికి తెలియదు.అతడి పేరు పెట్ల ఉమాశంకర్ గణేష్.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

ఇతడు ప్రస్తుతం వైస్సార్సీపీ పార్టీ తరపున నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యే గా ఉన్నాడు.

Advertisement

దర్శకుడు పూరి జగన్నాద్ తమ్ముడు ఒక ఎమ్మెల్యే అని ఎక్కడ చెప్పుకోకపోవడం విశేషం.ఇక ఉమా శంకర్ గణేష్ మొదట్లో టీడీపీ పార్టీ లో ఉండేవాడు.1995 నుంచి రాజకీయాల్లో ఉన్న ఉమా శంకర్ గణేష్ 2001 వరకు సర్పంచ్ గా, 2009 నుంచి 12 వరకు తాండవ ఆయకట్టు సంఘానికి ఛైర్మెన్ గా పని చేసాడు.ఇక ఆ తర్వాత జగన్ పార్టీ లో చేరి 2014 లో ఎమ్మెల్యే గా ఓడిపోయి 2019 లో మాత్రం మంచి మెజారిటీ తో గెలిచి అసెంబ్లీ లో అడుగు పెట్టాడు.

తాజా వార్తలు