సినీనటి సమంత ఒకవైపు అనారోగ్య సమస్యతో బాధపడుతూనే మరోవైపు యశోద సినిమా డబ్బింగ్ పనులను కూడా పూర్తి చేశారు.ఈమె మయూసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నప్పటికీ డాక్టర్ ను పక్కన పెట్టుకొని మరి డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేశారని యశోద సినిమా నిర్మాత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.
ఇకపోతే ఈమె అనారోగ్య సమస్య నుంచి కాస్త కుదుటపడటంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె అనారోగ్య సమస్యల గురించి తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.
ఇకపోతే యశోద సినిమా గురించి కూడా సమంత మాట్లాడుతూ తాను ఒక సినిమా కథ విన్నప్పుడు ఆ సినిమా ఫైనల్ చేయడానికి ఒక రోజు వరకు సమయం తీసుకుంటాను కానీ యశోద సినిమా కథ వింటున్నప్పుడు నాలో ఏదో తెలియని ఎక్సైట్మెంట్ ఉంది అలాంటి ఎగ్జైట్ మెంట్ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఉంటుందని తాను ఈ సినిమా కథ విన్న వెంటనే ఓకే చెప్పానని తెలిపారు.ఈ సినిమా ఎంతో పవర్ఫుల్ సినిమా తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఈమె వెల్లడించారు.
ఇకపోతే మనం ఒక సినిమాలో నటిస్తున్నప్పుడు ఆ పాత్రని ఎంతోగానో ప్రేమిస్తున్నప్పుడు ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పి మన వాయిస్ అందరికీ వినపడాలని కోరుకుంటాము.ఈ క్రమంలోనే ఈ సినిమా కథ విన్నప్పుడే ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పాలని భావించాను అందుకే ఎంత కష్టమైనా కానీ ఈ సినిమా డబ్బింగ్ పూర్తి చేశానని సమంత వెల్లడించారు.ఒకసారి నేను ఏ విషయం గురించి అయినా కమిట్ అయ్యాను అంటే ఆ పని చేసి తీరాల్సిందే నాకు మొండితనం ఎక్కువ.ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ డబ్బింగ్ పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఈ సందర్భంగా ఈమె యశోద సినిమా గురించి సంతోషం వ్యక్తం చేశారు.