ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి నారాయణ స్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించిన ఆయన సర్కార్ అన్నీ రంగాల్లో విఫలమైందని ఆరోపించారు.
ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాను మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు.కేంద్రం ఇస్తున్న నిధులను సీఎం జగన్ దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
అన్నమయ్య జిల్లా డ్యామ్ కొట్టుకుపోయినా రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు ఇంత వరకు నివాస యోగ్యం కల్పించలేదని విమర్శించారు.కేంద్రం ఒక్కో ఇంటికి రూ.లక్షా 80 వేలు మంజూరు చేసినా ఏపీలో ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.







