ఉమెన్ ప్రపంచకప్ లో ఎంత మంది తల్లులు పాల్గొన్నారో తెలుసా...

పెళ్లి చేసుకొని పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా ఆడవారు తమ వృత్తిలో రాణిస్తున్నారు.ఇందుకు క్రికెట్ మినహాయింపేమీ కాదు.

ఈ మహిళా క్రికెటర్లు తమ పిల్లల్ని వెంటబెట్టుకుని మరీ ఆట ఆడేందుకు ముందుకొస్తున్నారు.ప్రస్తుతం న్యూజిలాండ్ దేశంలో ప్రపంచ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే.

అయితే ఈ ప్రపంచ కప్ లో పాల్గొన్న మహిళా క్రికెటర్లలో చాలా మంది తల్లులు ఉన్నారు.వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

పాకిస్థాన్ క్రికెటర్ బిస్మా మరూఫ్ తన కూతురు ఫాతిమా తో ప్రపంచ కప్ మ్యాచ్ లు ఆడేందుకు న్యూజిలాండ్ విచ్చేసింది.ఆమె కూతురికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వరల్డ్ కప్ ప్రారంభమైన సమయం నుంచి ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.

Advertisement
Do You Know How Many Mothers Participated In The Women's World Cup , Women's Wo

ఈ చిన్నారి వయస్సు కేవలం ఆరు నెలలే కావడం విశేషం.ఈ చిన్నారిపై మన టీమిండియా క్రికెటర్లు అమితమైన ప్రేమను కురిపిస్తున్నారు.

న్యూజిలాండ్ మహిళా క్రికెట్ క్రికెటర్ లీ తహుహు వైట్ ఫెర్న్స్ అమీ సాటర్త్‌వైట్ తో కలిసి గ్రేస్ మేరీ సాటర్త్‌వైట్ అనే బిడ్డకు జన్మనిచ్చింది.ఈమె కూడా తన బిడ్డను ప్రపంచకప్ మ్యాచ్‌కు తీసుకొచ్చినట్లు సమాచారం.

దక్షిణాఫ్రికా లెజెండరీ బ్యాట్ ఉమెన్ లిజెలీ లీ కూడా ఇటీవలే తల్లయ్యింది.సౌత్ ఆఫ్రికా లేడీ క్రికెటర్ మసబాటా క్లాస్ కూడా తల్లి పాత్ర పోషిస్తోంది.

వెస్టిండీస్ ప్లేయర్ ఎఫీ ప్లేచర్ వంటి తదితర ప్లేయర్లు కూడా ఇప్పుడు టోర్నీలో తల్లులుగా ఉన్నారు.

Do You Know How Many Mothers Participated In The Womens World Cup , Womens Wo
శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

వీరంతా కూడా తమ పిల్లలకు దూరంగా ఉంటూ దేశం కోసం ఆడుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు.వీరికి ఆయా దేశాల క్రికెట్ బోర్డులు బాగా సపోర్ట్ చేస్తున్నాయి.బ్రేక్ ఇచ్చేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి.

Advertisement

ఏది ఏమైనా అంతర్జాతీయ క్రికెట్ లో ఆడాలంటే మానసికంగా, శారీరకంగా, సామాజికంగా అన్ని సమస్యలను అధిగమించాలి.అయితే తల్లులైన ఈ మహిళా క్రికెటర్లు తమ సంకల్పబలంతో ఆడుతూ అందరి చేత సలాం కొట్టించుకుంటున్నారు.

తాజా వార్తలు