మీ దగ్గర పాత TV వుందా? అయితే ఇలా స్మార్ట్​ TVగా మార్చేసుకోండి!

అదేంటి? పాత TVలను స్మార్ట్​ TVగా మార్చే వీలు వుంటుందా? అని ఆశ్చర్య పోవద్దు.ఈ కధనం పూర్తిగా చదివితే మీకే అర్ధం అవుతుంది.

అది కూడా Airtel కస్టమర్లకు మాత్రమే ఈ సదవకాశం.అవును, సాధారణ TVలను కేవలం రూ.1500లకే స్మార్ట్ TVలుగా మార్చుకునే అవకాశాన్ని ఇపుడు Airtel అందిస్తోంది.Airtel ఎక్స్​ట్రీమ్​ బాక్స్​ ద్వారా పాత TVని స్మార్ట్ TVగా మార్చుకునే అవకాశాన్ని ఇపుడు తన వినియోగదారులకు కల్పిస్తోంది.

కుటుంబ సమేతంగా TV చూసే వారిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫర్ ప్రకటించడం కొసమెరుపు.ఇకపోతే నేడు OTTల హవా కొనసాగుతున్నవేళ, ఆ అవకాశం లేని వారికి స్మార్ట్ వినోదం పరిచయం చేసేందుకు ఈ ప్లాన్ చేసిందని నిపుణులు చెబుతున్నారు.

అంటే Airtel ఎక్స్​ట్రీమ్​ బాక్స్.​పాత TVలలోనే నేరుగా OTT కంటెంట్​ను ప్రసారం చేసే మాస్టర్ ప్లాన్ వేస్తోంది.ఇకపోతే ఎక్స్​ట్రీమ్ బాక్స్ అసలు ధర రూ.2,650 కాగా వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని కేవలం రూ.1500లకే అందిస్తోంది.ఈ ఎక్స్​ట్రీమ్​ సెటప్ బాక్స్ ద్వారా.

Advertisement

సోనీ లివ్, అమెజాన్ ప్రైమ్, ఈరోస్ నౌ, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి అనేక ఓటీటీ ప్లాట్​ఫామ్​లోని కంటెంట్​ను చూడవచ్చు.

అంతేకాకుండా ఈ ఫీచర్లతో పాటు.ఈ సెటప్ బాక్స్ 4కే రిజల్యూషన్ కంటెంట్​ను కూడా అందిస్తుంది.కావలసినవారు ఈ బాక్స్​ను కంపెనీ వెబ్‌సైట్ నుంచి నేరుగా ఆర్డర్ చేసుకోండి.

లేదా దగ్గర్లోని ఎయిర్​టెల్ రిటైల్ స్టోర్​కు వెళ్లినా.ఈ సెటప్ బాక్స్ అందుబాటులో ఉంటుందని సదరు యాజమాన్యం చెబుతోంది.

కాగా, ఇలాంటి ఫీచర్లతోనే మార్కెట్లో మరో సెటప్ బాక్స్ అందుబాటులో ఉంది.టాటా ప్లే బింజ్+ పేరుతో టాటా స్కై కంపెనీ ఇలాంటి ఓటీటీ సెటప్ బాక్స్​ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
వైరల్ వీడియో : సినిమా స్టైల్లో మహిళను రక్షించిన జాలర్లు..

ఇకపోతే Airtel ఎక్స్​ట్రీమ్​ బాక్స్ 5000కు పైగా యాప్స్​కు సపోర్ట్ చేస్తుందని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు