ఉపవాసం ఉన్న రోజుల్లో తలకు నూనె రాయకూడదా..?

చాలా మంది తమకు ఇష్టమైన వారాల్లో లేదా పండుగలు, పబ్బాలు, పౌర్ణమి దినాల్లో ఉపవాసం ఉంటారు.

ఏమీ తినకుండా దేవుడికి పూజ చేసుకొని దైవ నామ స్మరణతో గడిపేస్తూ ఉంటారు.

అయితే ఉపవాసం ఉన్న రోజుల్లో తలకు నూనె రాయకూడదని చెబుతుంటారు చాలా మంది.అయితే నిజంగానే ఉపవాస రోజుల్లో తలకు నూనె రాయకూడదా.

ఒక వేళ రాస్తే ఏమవుతుంది, అసలెందుకు రాయకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఉపవాసం చేసే రోజుల్లో తలకు నూనె అండటడం నిషేధం అని పండితులు చెబుతున్నారు.

ఇందుకు ఒక శాస్త్రీయ కారణం ఉందని చెబుతున్నారు.శని గ్రహం శక్తి ప్రభావం వల్ల నూనె ఉత్పన్నం అయిమైనట్లుగా భావించడం జరిగింది.

Advertisement

తలకు నూనె పెట్టుకోవడం వల్ల తల చుట్టూ ఓ తేజోవలయం ఏర్పడుతుంది.  వలయం ఇతర గ్రహాల నుండి మన శరీరంలోకి ప్రసరించే అయస్కాంత తరంగాలను నిరోధిస్తుంది.

కానీ ఉపవాసం పాటించు రోజుల్లో ఇది వేరుగా చెప్పబడింది.ఉపవాస దీక్షను పవిత్ర మనస్సు మరియు శరీరంతో ఆచరించటం జరిగుతుంది.

కాబట్టి మన శరీరానికి ఇతర గ్రహాల మరియు నక్షత్రాల నుండి భూమిపైకి ప్రసరించే అయస్కాంత తరంగాల అవసరం ఉంటుంది.తలపై రాసిన నూనె ఈ శక్తి తరంగాలను మనలోకి ప్రసరించకుండా అడ్డుకుంటుంది.

కాబట్టి ఇలాంటి నిషేధాన్ని ఉపవాస కాలంలో మన పెద్దలు ఏర్పాటు చేశారు.అందుకే మీరు ఉపవాసం ఉన్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో తలకు నూనె రాసుకోకండి.

కనుమ రోజున పొలిమేర ఎందుకు దాటకూడదు..?
Advertisement

తాజా వార్తలు