జీరో అవర్ లో పలు అంశాలపై చర్చించాలని నోటీసు : డీఎంకే ఎంపీ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారిగా ఉభయ సభలు సమావేశం కానున్నాయని అందరికీ తెలిసిందే.

ఉదయం 11 గంటలకు రాజ్యసభ సమావేశాలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి లోక్ సభ సమావేశాలు జరగనున్నాయి.అయితే రెండో రోజు (ఈ రోజు) జరిగే రాజ్యసభ సమావేశాల్లో జీరో అవర్ లో పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అధ్యక్షతన ఈ పలు అంశాలపై చర్చించనున్నారు.జీరో అవర్ లో పలు అంశాలపై చర్చించాలంటూ విపక్ష పార్టీ నాయకులు ఇప్పటికే రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకి నోటీసులు అందజేశారు.

డీఎంకే ఎంపీ శాంతుసేన్ నీట్ పరీక్షల నిర్వహణలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ విషయంపై చర్చించాలని ఆయన నోటీసు ఇచ్చారు.మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతావ్, కరోనా వ్యాప్తిపై టీఎంసీ ఎంపీ శాంతుసేన్ నోటీసులు జారీ చేశారు.

Advertisement

దీంతోపాటుగా పలు బిల్లును కూడా ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం.నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ బిల్లు, దివాలా కోడ్ బిల్లు, ఆయుర్వేద బిల్లులో ఇనిస్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్జ్ బిల్లు, ఎయిర్ క్రాఫ్ట్ బిల్లలను రాజ్యసభలో ప్రవేశ పెట్టనున్నారు.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు